Raw Vegetables: ఆరోగ్యం పేరుతో పచ్చి కూరగాయలు తింటున్నారా? అయితే మీకు డేంజర్.. ఎలాగంటే?

కూరగాయాలు, ఆకు కూరలను పక్కన పెడితే గుడ్లను కూడా కొంతమంది పచ్చివి తీసుకుంటూ ఉంటారు. అయితే కోడిగుడ్లను పచ్చివి తీసుకోవడం వలన అందులోని బ్యాక్టీరియా ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

Written By: Suresh, Updated On : December 27, 2023 4:22 pm

Raw Vegetables

Follow us on

Raw Vegetables: ప్రస్తుత కాలంలో ఆరోగ్యం కోసం అంటూ రకరకాల తిండ్లకు ప్రజలు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలోనే కొంత మందికి పచ్చి కూరగాయాలు, ఆకుకూరలు, నానబెట్టిన చిరు ధాన్యాలు తినడం అలవాటు. అయితే వీటిలో పచ్చి కూరగాయాలు, ఆకు కూరలు తీసుకోవడం మంచిదని చెబుతున్నప్పటికీ దాని వలన కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నార్మల్ గా ఫాస్ట్ పుడ్, జంక్ పుడ్ ఎక్కువగా తింటుండటంతో శరీరానికి కావాల్సిన పోషకాలు సరిగా అందవు. ఇందుకోసం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని భావిస్తూ చాలా మంది ఆకు కూరలు, కూరగాయాలను పచ్చిగా లేదా సగం ఉడికించి తింటూ ఉంటారన్న సంగతి దాదాపు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. పచ్చి కూరగాయాల బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి..అందుకే వీటిని శుభ్రపరిచిన తరువాతే తినాలి. కాలీఫ్లవర్, పాలకూర, బ్రకోలీ వంటి వాటిని అయితే ఉప్పు నీటిలో కడిగిన తరువాత మంచి నీటిలో కడగాలని చెబుతున్నారు. ఈ విధంగా కడగడం వలన బ్యాక్టీరియా నశిస్తుంది. అయితే పాలకూర, గోంగూర, బచ్చలికూర వంటి ఆకు కూరల్లో ఆక్సలేట్ అనే హానికర పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని ఉండికించిన తరువాతే తినాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆకుకూరలను తినాలనుకుంటే మాత్రం కనీసం 30 నిమిషాల పాటు ఉడికించి తీసుకోవాలి. మార్కెట్ నుంచి తీసుకువచ్చిన కూరగాయాలను కాసేపు ఎండలో పెట్టడం మంచిదట. ఆ తరువాత వాటిని నీటితో శుభ్రం చేయాలి. ఈ క్రమంలోనే వానాకాలంలో అయితే పచ్చి ఆకుకూరలతో పాటు వంకాయ, కాలిఫ్లవర్ మరియు క్యాప్సికం ను అసలు తినకూడదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

కూరగాయాలు, ఆకు కూరలను పక్కన పెడితే గుడ్లను కూడా కొంతమంది పచ్చివి తీసుకుంటూ ఉంటారు. అయితే కోడిగుడ్లను పచ్చివి తీసుకోవడం వలన అందులోని బ్యాక్టీరియా ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. మామూలుగా ఏ సీజన్ లోనైనా దాదాపుగా వ్యాధులు కలుషిత నీరు కానీ, ఆహారం వలన కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం తీసుకునే ఆహారాన్ని శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.