Health Tips: మనుషులు మాంసాహార ప్రియులు. మాంసాహారం లేనిదే ముద్ద దిగని వారు చాలా మంది ఉన్నారు. కొందరైతే నిత్యం మాంసంతోనే భోజనం చేసే వారు కూడా ఉండటం గమనార్హం. అతి దేనికైనా మంచిది కాదు. ఇప్పుడు అదే మన పాలిట శాపంగా మారుతోంది. మాంసాహారం తినే వారికి ఓ చేదు వార్త భయపెడుతోంది. సూపర్ బగ్ వ్యాధిగా రూపాంతరం చెందడంతో అందరిలో భయాందోళనలు కలుగుతున్నాయి. చైనాలో కరోనా తరువాత వెలుగులోకి వచ్చిన సూపర్ బగ్ ఇప్పుడు కలవరపెడుతోంది. జంతుసంబంధమైన ఆహారాల్లోనే ఇది ఉండటం వల్ల ఇక మాంసాహారాలు మానాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

యాంటీ బయాటిక్స్ తీసుకోవడం వల్ల మన అవయవాలు పనిచేయడం మానేస్తాయి. దీంతో మనకు ఇన్ఫెక్షన్ సోకితే నయం కాదు. ఈ సమయంలో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా ప్రాణాంతకమే కావచ్చు. అందుకే చికెన్, మటన్ తినేవారికిి సూపర్ బగ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. మన శరీరంలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా రెండు ఉంటాయి. మంచి బ్యాక్టీరియా మన దేహానికి మేలు చేస్తే చెడు బ్యాక్టీరియా మాత్రం మన రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీన్ని పరాన్నజీవిగా చెబుతుంటారు. శరీరంలో దాని సంఖ్య పెరిగినప్పుడు యాంటీ బయాటిక్ పై ప్రభావం చూపుతుంది. దీన్ని యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ స్థితి అని పిలుస్తారు.
ప్రస్తుత రోజుల్లో జంతువులు తొందరగా పెరిగేందుకు వాటికి ఇంజక్షన్లు ఇస్తున్నారు. అదే మన పాలిట మృత్యువులా మారుతోంది. ఇంజక్షన్ల ప్రభావంతో సూపర్ బగ్ వ్యాధి పొంచి ఉంది. వీటి మాంసం తినడం వల్ల యాంటీ బయాటిక్స్ మన శరీరంలోకి చేరడంతో సూపర్ బగ్ ప్రమాదం కలుగుతోంది. ఈ నేపథ్యంలో చికెన్, మటన్ లకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. 2018లో ఓ నివేదిక వచ్చింది. ఇందులో భారతదేశంలో జంతువులు త్వరగా ఎదగడానికి యాంటీ బయాటిక్స్ ఇంజక్షన్లు ఇస్తున్నారని వెల్లడించింది.

లండన్ కు చెందిన ఎన్ జీవో బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఈ విషయాన్ని ప్రచురించింది. దీంతో జంతువుల మాంసం మనుషులకు హానికరమైనదిగా గుర్తిస్తున్నారు. ఇందులో టైలోసిన్ అనే డ్రగ్ వాడుతున్నట్లు చెబుతున్నారు. ఇకపై జంతువుల మాంసం తింటే సూపర్ బగ్ ప్రమాదం వస్తే చికిత్స కూడా కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జంతువుల మాంసం ఇక మానకుంటే సూపర్ బగ్ వ్యాపిస్తే చికిత్స కూడా కష్టమే అని తెలియజేస్తున్నారు.
మాంసంలో ప్రొటీన్లు ఉన్నాయనే ఉద్దేశంతో చాలా మంది వీటికి ఆకర్షితులయ్యారు. పైగా జిహ్వ చాపల్యం కావడంతో అందరు నోటి రుచి కోసం మాంసాన్ని ఆశ్రయించడం కామనే. ఇందులో ఉండే ప్రొటీన్లు పన్నీర్, పాల ఉత్పత్తుల్లో కూడా ఉంటాయి. కానీ వాటిని తీసుకోవడానికి ఇష్టపడరు. పప్పుల్లో కూడా పోషకాలు మెండుగా ఉంటాయి. చికెన్, మటన్ తినడం మానుకుని ఇకపై ఇతర పదార్థాలను తీసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. మాంసాహార ఉత్పత్తులను సాధ్యమైనంత వరకు దూరం చేసుకోవాలని హితవు చెబుతున్నారు.