Chips and Pizza: ప్రస్తుత కాలంలో ఫాస్ట్ ఫుడ్ ను తినేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడటం వల్ల శరీరానికి లాభాల కంటే నష్టాలు ఎక్కువగా కలుగుతాయి. తరచూ ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, చిప్స్ తినేవాళ్లను అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిజ్జాలు, చిప్స్ తినడం వల్ల రక్తపోటు, షుగర్, బరువు పెరగడం, ఇతర అనారోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది.

బ్రెయిన్, బిహేవియర్, ఇమ్యూనిటీ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను ప్రచురించారు. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, నిల్వ పదార్థాలు, ఫ్లేవర్ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మెమొరీ లాస్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యకరమైన పదార్థాలతో పిజ్జాలు, ఇతర జంక్ ఫుడ్స్ ను తయారు చేయడం జరుగుతుంది. ప్రాసెస్ చేయబడిన మాంసం, శుద్ధి చేసిన పిండి తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి.
శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరిపి ఈ విషయాలను వెల్లడించారు. ఈ తరహా ఆహారం తిన్న ఎలుకలలో మెదడు పనితీరు మందగించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒహియో స్టేట్ యూనివర్శిటీ సీనియర్ పరిశోధకులు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తిన్నవాళ్లు ఉన్నట్లుండి అన్నీ మరిచిపోతున్నారని వెల్లడించారు. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఇష్టపడేవాళ్లు ఆ ఆహారాన్ని మితంగా తీసుకుంటే మంచిది.
Also Read: Social Trends: అమ్మాయిల ప్రేమకు.. అబ్బాయిల ప్రేమకు తేడా ఇదే?
సరైన ఆహారపు అలవాట్లు లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది. పిజ్జాలు, ఇతర ఆహార పదార్థాలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. పిజ్జాలు, చిప్స్ లాంటి ఆహార పదార్థాలకు తల్లిదండ్రులు పిల్లలను దూరంగా ఉంచితే మంచిదని చెప్పవచ్చు.