Body Heat: శరీరంలో వేడిని తగ్గించాలంటే వీటిని తప్పక తినండి..

పుచ్చకాయ వేసవిలో మాత్రమే లభిస్తుంది. అయితే ఇప్పుడు కొన్ని స్టోర్లలో మిగతా కాలాల్లో కూడా లభిస్తున్నాయి. కానీ వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.

Written By: Chai Muchhata, Updated On : August 25, 2023 6:44 am

Body Heat

Follow us on

Body Heat: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ గడపడంతో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు. దీంతో అనేక కొత్త కొత్త రోగాలు వస్తున్నారు. అయితే వ్యాధులు పొగోట్టుకోవడానికి చాలా మంది మెడిసిన్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు తప్ప ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదు. మార్కెట్లో చాలా వరకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు లభిస్తాయి. కానీ వాటిని పెద్దగా పట్టించుకోసం. కానీ ఎలాంటి మెడిసిన్ జోలికి వెళ్లకుండా వీటిని తినడం వల్ల కొన్ని వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ కాలంలో చాలా మంది శరీరాల్లో ఉష్ణోగ్రత పరిమితి కంటే ఎక్కువగా ఉంటున్నట్లు కొన్ని వైద్య పరిశోధనల ఆధారంగా తెలుస్తోంది. వేడి ఎక్కువగా కావడం వల్ల డైజేషన్ తో పాటు ఇతర అవయవాలు దెబ్బతింటాయి. అయితే ముందుగా శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించుకుంటే ఇతర వ్యాధులు రాకుండా అడ్డుకవచ్చు. అయితే శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించాలంటే కొన్నింటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే?

మార్కట్లో వేడి తగ్గించే చాలా మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే ప్రతీరోజూ వేడి చేసే వస్తువులను తగ్గించడం వల్ల కూల్ కావొచ్చు. అయితే కొన్ని తప్పనిసరిగా తినాల్సిన పదార్థాలు వేడి చేస్తాయి. ఇలాంటి సమయంలో వాటిని తీసుకుంటూనే ఉష్ణోగ్రత తక్కువగా మారే వాటిని తీసుకోవాలి. వీటిలో ప్రధానంగా ఫ్రూట్స్ ను చెప్పుకోవచ్చు. కొన్ని పండ్లల్లో వేడిని తగ్గించే గుణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఇవి ఎక్కువగా వస్తాయి. అయితే సాధారణ కాలంలోనూ ఇవి అందుబాటులో ఉంటే తీసుకోవడం చాలా మంచిది. దీంతో శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు.

పుచ్చకాయ వేసవిలో మాత్రమే లభిస్తుంది. అయితే ఇప్పుడు కొన్ని స్టోర్లలో మిగతా కాలాల్లో కూడా లభిస్తున్నాయి. కానీ వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. బయటికి వెళ్లేటప్పుడు పుచ్చకాయ తినడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య అస్సలు ఉండదు. పుచ్చకాయ తినడం వల్ల శరీరాన్ని కూల్ చేసి జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. మామిడి పండు తినడం వల్ల వేడి చేస్తుందని చాలా మంది అనుకుంటారు. అయితే మామిడి పండును నేరుగా కాకుండా జ్యూస్ తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. ఇందులో ఉండే కొన్ని పోషకాలు డీ హైడ్రేషన్ నుంచి బయటపడేస్తాయి.

వేసవి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బంది పడుతారు. వీరు హీట్ కు గురైనప్పుడు డీ హైడ్రేషన్ కు గురై రక్తంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. ఇలాంటి సమయంలో స్ట్రాబెర్రీ తీసుకోవడం ఉత్తమం. ఇది శరీరంలోని వేడిని తగ్గించడమే కాకుండా ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. వీటిలో ఉండే పోషకాలు సైతం ఎంతో ఎనర్జీ గా ఉంటుంది. అందువల్ల వేడి ఎక్కువగా ఉన్న వారు ఎక్కువగా చల్లదనాన్ని ఇచ్చే ఫ్రూట్స్ తినడం వల్ల హీట్ తగ్గడమే కాకుండా శరీరానికి ఎంతో ఎనర్జీ ఇస్తుంది.