Horoscope Today: ఈరోజు ద్వాదశ రాశులపై ధనిష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. మంగళవారం ద్విపుష్కర యోగం కారణంగా కర్కాటకం, సింహ రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయిజ 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి:
ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. పెండింగు పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెడుతారు. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు.
వృషభ రాశి:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొన్ని ప్రాజెక్టుల కారణంగా కష్టపడుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు.
మిథున రాశి:
ఎక్కువగా వాదనలు చేయొద్దు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో సమస్యలు ఏర్పడే అవకాశం. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి సలహాతో కొన్ని పెండింగు పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి:
ఉద్యోగాలకు సంబంధించి కొంత సమాచారం అందుకుంటారు. వ్యాపారుల కొత్త పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. జీవిత భాగస్వామితో సంయమనం పాటించాలి. వ్యాపారులు బిజీ షెడ్యూల్ గడుపుతారు.
సింహారాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. బంధువుల మధ్య సంబంధాలు మెరుగుపడుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కన్య రాశి:
స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా ధన లాభం ఉండే అవకాశం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల కెరీర్ కు సంబంధించి అదనపు సమాచారం అందుకుంటారు.
తుల రాశి:
అనారోగ్యాలు వెంటడుతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. ఎవరికైనా అప్పు ఇవ్వడానికి సంకోచించాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో సీనియర్ల మద్దతు పొందేందుకు ప్రయత్నించాలి. చిన్న పాటి సమస్య కారణంగా జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడుతాయి.
వృశ్చిక రాశి:
ఏదైనా పని ప్రారంభించే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వివాహం కోసం ప్రతిపాదనలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు.
ధనస్సు రాశి:
జీవిత భాగస్వామితో కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. విహర యాత్రలకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులు గురువుల ఆశీస్సులతో అనుకున్న లక్ష్యాన్ని చేరుతారు. జీవిత భాగస్వామి కోసం సమయాన్ని వెచ్చిస్తారు. మనసు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
మకర రాశి:
పెండింగు పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి.వీటిపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. భవిష్యత్ కోసం కొన్ని కొత్త పెట్టుబడులు పెడుతారు. విదేశాల్లో ఉద్యోగం చేసేవారు శుభవార్త వింటారు. ఉద్యోగులు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కుంభరాశి:
జీవిత భాగస్వామితో విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఆదాయం పొందేందుకు ఇతర ఉద్యోగాలు చేస్తారు. ఇంటికి అతిథులు రావొచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కొంత అదనపు సమాచారం వింటారు విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు.
మీనరాశి:
శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగంలో ఉన్న వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పెండింగు పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు హాని కలిగించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. లేకుంటే చిక్కుల్లో పడుతారు.