Homeలైఫ్ స్టైల్Durex Survey Report: శృంగారం.. 70 శాతం మహిళల్లో అసంతృప్తి..!

Durex Survey Report: శృంగారం.. 70 శాతం మహిళల్లో అసంతృప్తి..!

Durex Survey Report: భారతదేశంలో శృంగారం అనేది ఇప్పటికీ చర్చకు నిషిద్ధమైన అంశంగా పరిగణించబడుతుంది. డ్యూరెక్స్‌ సర్వే ప్రకారం, 70% మహిళలు శృంగారంలో సంతృప్తి చెందడం లేదని, 40% మంది తమ భాగస్వాములతో సంతృప్తిని నటిస్తున్నారని తేలింది. ఈ సమస్యలకు మూల కారణం సమాజంలో బహిరంగ చర్చలు లేకపోవడం, స్త్రీలు తమ కోరికలను వ్యక్తీకరించడంలో ఉన్న సంకోచం, సాంస్కృతిక నిషేధాలు కారణంగా చెబుతన్నారు.

Also Read:  వివాహేతర సంబంధాలు వెరీ కామన్ అయిపోయాయి.. ఇదే నిదర్శనం!

సంతృప్తి లోపం..
డ్యూరెక్స్‌ సర్వే ప్రకారం, మహిళలు తమ శృంగార కోరికలను భాగస్వాములతో బహిరంగంగా చర్చించకపోవడం వల్ల సంతృప్తి లోపిస్తుంది. భారతీయ సమాజంలో శృంగారం గురించి మాట్లాడటం సిగ్గుకరంగా భావించబడుతుంది, ఇది మహిళలు తమ అవసరాలను వ్యక్తపరచకుండా నిరోధిస్తుంది. ఈ సంకోచం స్త్రీ–పురుష సంబంధాలలో భావోద్వేగ దూరాన్ని సృష్టిస్తుంది, ఫలితంగా శృంగార అసంతృప్తి పెరుగుతుంది. బహిరంగ సంభాషణలు, భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన ఈ సమస్యను పరిష్కరించడంలో కీలకం.

ఫీమేల్‌ జనిటల్‌ మ్యూటిలేషన్‌..
భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా కొన్ని సమాజాలలో ఫీమేల్‌ జనిటల్‌ మ్యూటిలేసన్‌(ఎఫ్‌ఎంజీ) ఒక ఆందోళనకర సమస్యగా కొనసాగుతోంది. ఈ పద్ధతి మహిళల శృంగార కోరికలను తగ్గించడానికి, సంతృప్తిని నిరోధించడానికి ఉద్దేశించబడింది. భారతదేశంలో ఎఫ్‌ఎంజీ నియంత్రించే నిర్దిష్ట చట్టాలు లేకపోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. యూకేలో 5 వేల ఎఫ్‌ఎంజీ కేసులు నమోదైనట్లు గుర్తించబడినప్పటికీ, ఈ అంశం బహిరంగ చర్చకు రాకపోవడం దాని గుట్టుగా మిగిలిపోతుంది. ఎఫ్‌ఎంజీ మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

పూర్వీకుల నుంచి∙ఆధునిక కాలం వరకు..
ఆశ్చర్యకరంగా, భారతీయ సంస్కృతిలో శృంగారం గురించి పూర్వీకుల జ్ఞానం ఆధునిక కాలం కంటే అధికంగా ఉండేది. 11వ శతాబ్దంలోనే రతిశాస్త్రం ద్వారా అరోజల్‌ పాయింట్స్‌ గురించి లోతైన అవగాహన ఉండేది. కామసూత్రం వంటి గ్రంథాలు శృంగార సంతృప్తి, భాగస్వాముల మధ్య సమతుల్య సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ జ్ఞానం ఆధునిక సమాజంలో కోల్పోయినట్లు కనిపిస్తుంది, ఇది సామాజిక నిషేధాలు, అవగాహన లోపం వల్ల జరిగింది.

Also Read: మీ ఆరోగ్యానికి 24/7 ఏఐ సహాయకుడు

సామాజిక ద్వంద్వ ధోరణులు..
రూటర్స్‌ సర్వే ప్రకారం, 77% భారతీయ పురుషులు వర్జిన్‌ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు, అయితే 70% మంది తాము ఇతరులతో శృంగార సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ ద్వంద్వ ధోరణి సమాజంలో స్త్రీ–పురుష అసమానతలను హైలైట్‌ చేస్తుంది. పురుషులు తమ స్వేచ్ఛను ఆస్వాదిస్తూనే, స్త్రీలపై కఠిన నీతి నియమాలను ఆశిస్తారు. ఈ ద్వంద్వ ధోరణి మహిళల శృంగార స్వేచ్ఛను పరిమితం చేస్తుంది, ఫలితంగా సంతృప్తి లోపం మరింత తీవ్రమవుతుంది. శృంగార సంతృప్తి కేవలం శారీరక ఆనందానికి సంబంధించినది మాత్రమే కాదు, ఇది మహిళల మానసిక, శారీరక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. సంతృప్త శృంగార జీవనం ఒత్తిడిని తగ్గిస్తుంది, హార్మోనల్‌ సమతుల్యతను పెంపొందిస్తుంది. సంబంధాలలో భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది. అసంతృప్తి మాత్రం ఆత్మవిశ్వాసం తగ్గడం, ఒత్తిడి, సంబంధాలలో ఒడిదుడుకులకు దారితీస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular