Shani Effect 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల వారికి వారి జన్మ నక్షత్రం ఆధారంగా రాశులు కేటాయించబడతాయి. ఒక్కో రాశి వారికి ఫలితాలు ఒకోలా ఉంటాయి. పన్నెండు రాశుల వారికి ఫలితాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. దీంతో వారి జాతకం ఎలా ఉండబోతోందనే దానిపై అందరికి అనుమానాలు ఉండటం సహజమే. ఈ నేపథ్యంలో వారి రాశి ఫలాలు చూసుకుని తమకు ఎప్పుడు మంచి జరుగుతుందో ఎప్పుడు చెడు చోటుచేసుకుంటుందో అని తెలుసుకుని బాధ పడుతుంటారు. ఈ నేపథ్యంలో మనకు శనీశ్వరుడు అంటే అందరికి భయమే. తాను మనకు ఏం కీడు చేస్తారోనని ఆందోళన చెందుతుంటారు. కానీ శని మనకు కొన్ని సమయాల్లో లాభాలు, మరికొన్ని సందర్భాలు మేలు చేస్తూనే ఉంటాడు. దీనిపై సందేహాలు కూడదని చెబుతుంటారు జ్యోతిష్యులు.

శని దేవుడు జనవరి 17న కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్ని రాశులపై ప్రతికూల, మరికొన్ని రాశులై అనుకూల ప్రభావాలు పడనున్నాయి. దీంతో శని సంచారం వల్ల మనకు ఏ లాభాలు, నష్టాలు కలుగుతున్నాయో తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండొచ్చు. శని కుంభరాశిలోకి ప్రవేశించగానే మిథున, తుల రాశులపై మంచి ప్రభావం చూపనున్నాడు. వారికి అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తవుతాయి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. రావల్సిన బకాయిలు వసూలవుతాయి. సంఘంలో పలుకుబడి ఇనుమడిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది.
ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వచ్చే సూచనలున్నాయి. దీంతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కోరిక కూడా తీరుతుంది. ధనుస్సు రాశి వారికి బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి, వాహనం ఏదైనా మీకు కలిసొస్తుంది. మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరించుకోవచ్చు. ఉద్యోగ రీత్యా కోరుకున్న చోటుకు బదిలీ కావచ్చు.

శని కుంభరాశిలో ప్రవేశించాక మీన రాశి వారికి ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. వీరు జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఇబ్బందులు తప్పవు. జ్యోతిష్య ప్రభావంతో కొన్ని బాధలు తప్పవు. ఏలిన నాటి శని ప్రభావం చేత సమస్యలు రావచ్చు. కానీ ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలాలి. ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు. సహనం నశించకుండా చూసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో అణిగి ఉండాలి. లేదంటే ఇబ్బందులు రావచ్చు. శని కుంభరాశిలోకి ప్రవేశించడంతో మీన రాశి వారికి కొన్ని తిప్పలు తప్పకపోవచ్చు. వాటిని ఎదుర్కోవాలి.