
Drumstick Leaves Benefits: మనకు ఆరోగ్యం కలిగించే ఆహారాల్లో మునగాకు, కరివేపాకు ఎంతో మంచివి. ఇందులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మునగాకును పప్పులో వేసుకోవచ్చు. పచ్చడిగా తయారు చేసుకోవచ్చు. ఆకు కూరల్లో మునగాకులో ఉండే ప్రొటీన్లు ఎందులో కూడా దొరకవు. ఇక కరివేపాకు కూడా మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఆయుర్వేదంలో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రెంటిని కలిపి జ్యూస్ చేసుకుని తాగితే మన శరీరానికి బలం చేకూరుతుంది. అందుకే వీటిని తీసుకోవడం వల్ల మనకు రక్షణ కలుగుతుంది.
ఎలా తీసుకోవాలి
మునగాకు అరకప్పు, కరివేపాకు పావుకప్పు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టి ఒక గ్లాసులోకి తీసుకుని అరచెక్క నిమ్మరసం ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే మనకు ఎంతో లాభం ఉంటుంది. ఇలా ఒక వారం రోజులు తాగితే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎటువంటి ఇన్ ఫెక్షన్ లు రాకుండా ఉంటుంది. మన దేహాన్ని కాపాడేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఆయుర్వేదంలో ఈ రెండు ఆకులకు మంచి డిమాండ్ ఉంది.
ఎన్ని రోజులు తీసుకోవాలి
ఈ జ్యూస్ ను వారం రోజుల పాటు తీసుకోవాలి. అధిక బరువుతో బాధపడే వారు నెలరోజులు తీసుకోవచ్చు. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది డయాబెటిస్ ఉన్న వారు తేనెను తీసుకోవద్దు. దీన్ని తీసుకుంటే కళ్లకు కూడా ఆరోగ్యమే కండరాలు బలంగా తయారవుతాయి. కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ జ్యూస్ మన ఆరోగ్యాన్ని కాపాడే పరమ ఔషధంగా చెబుతారు. అందుకే దీన్ని తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరమే అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

మునగాకు
మునగాకులో ఎంతో విలువైన ప్రొటీన్లు ఉంటాయి. దీన్ని పప్పులో వేసుకున్నా పచ్చడిగా తిన్నా ఆరోగ్యమే. దీని కాయలు కూడా మనకు పప్పులో వేస్తే మంచి రుచిగా ఉంటాయి. ఇలా మునగ ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు మందులా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మునగాకును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. ఇది షుగర్ కు మంచి మందు. దీన్ని తీసుకోవడ ద్వారా మధుమేమాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇంతటి విలువైన మునగాకును అసలు నిర్లక్ష్యం చేయొద్దు. ఎక్కడ దొరికినా తీసుకొచ్చుకుని కూరగా చేసుకుని తింటే ఎన్నో రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు.