Balakrishna and Gopichand Malineni movie: ‘అఖండ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrisna) నుండి విడుదలైన చిత్రం ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా విడుదలై కమర్షియల్ గా బాలయ్య ఖాతాలో మరో సూపర్ హిట్ చిత్రం గా నిల్చింది. మాస్ ఆడియన్స్ ని మాత్రమే కాకుండా, నేటి తరం యూత్ ఆడియన్స్ కి కూడా ఈ చిత్రం తెగ నచ్చేసింది. డ్యూయల్ రోల్ లో బాలయ్య ని గోపీచంద్ చాలా పవర్ ఫుల్ గా చూపించాడు. నందమూరి ఫ్యాన్స్ కి ఒక తీపి జ్ఞాపకం లాగా నిలిచిపోయింది ఈ చిత్రం. అలాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది. రీసెంట్ గానే పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే ఈసారి మాస్ కమర్షియల్ ప్రాజెక్ట్ తో కాకుండా, పీరియాడికల్ సబ్జెక్టు తో ఈ కాంబినేషన్ మన ముందుకు రానుంది.
అయితే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే సినిమా కాబట్టి, దానికి తగ్గట్టు బడ్జెట్ కూడా భారీగానే అవుతుంది. అప్పటి సెట్టింగ్స్, బ్యాక్ డ్రాప్ మూడ్ లోకి తీసుకొని రావాలంటే కనీసం 200 కోట్ల రూపాయిలు ఖర్చు అవుతుంది. బాలయ్య మీద అంత డబ్బులు పెట్టడానికి ఫైనాన్షియర్స్ ఆసక్తి చూపించడం లేదని టాక్. ఒకప్పుడు అయితే థియేట్రికల్ బిజినెస్ జరిగినా జరగకపోయినా నా థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగేది. నిర్మాత కేవలం ఓటీటీ రైట్స్ తోనే సేఫ్ జోన్ లోకి వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓటీటీ బిజినెస్ బాగా డౌన్ అయ్యింది. మూడేళ్ళ క్రితం చిన్న సినిమాలను కూడా 40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు పెద్ద సినిమాలకు కూడా 40 కోట్లు ఇవ్వడం గగనం అయిపోయింది.
అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంతటి భారీ బడ్జెట్ పెట్టడం చాలా కష్టమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. బాలయ్య కి వరుసగా నాలుగు హిట్స్ రావడంతో ఆడియన్స్ లో ఆయన పై నమ్మకం ఏర్పడింది. ప్రస్తుతం ఆయన మార్కెట్ కి తగ్గ బిజినెస్ జరగాలంటే థియేట్రికల్ నుండి 80 కోట్లు,నాన్ థియేట్రికల్ నుండి 40 , లేదా 50 కోట్ల బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద 130 నుండి 140 కోట్ల వరకు బాలయ్య సినిమాకు విడుదలకు ముందే బిజినెస్ జరుగుతుంది. హిందీ డబ్బింగ్ సాటిలైట్ రైట్స్ తో కలిపి మరో 20 కోట్లు అదనంగా వేసుకున్నా 160 కోట్లకు మించదు. అందుకే 200 కోట్ల బడ్జెట్ పెట్టడానికి ఫైనాన్షియర్స్ నిరాకరిస్తున్నారు. మరి టీం ముందు ఉన్న ఈ అతి పెద్ద సవాలు ని అధిగమిస్తారా?, అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా లేదా అనేది చూడాలి.