Holi 2022: హోలీ పండుగ అంటే చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారి దాకా అందరూ సంబురంగా జరపుకుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇండియాలో ఎంతో గ్రాండ్ గా జరపుకునే రంగుల పండుగ. మార్చి 18న వస్తున్న హోలీని జరుపుకోవడానికి అంతా రెడీ అవుతున్నారు. ఇక దీనికి ఒకరోజు ముందు మార్చి 17న కమధనాన్ని జరుపుకుంటారు. కాగా హోలీకి ముందు అంటే 10 నుంచి హోలాష్టక్ ప్రారంభమవుతుంది.

ఈ హోల్‌స్టాక్ ప్రారంభమైన రోజు నుంచి హోలీ రోజు వరకు అంటే 18 దాకా ఎలాంటి మంచి పనులు చేయరు. కాగా ప్రముఖమైన హోలీ పండుగ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా హోలీ రోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఆ రోజు ఇంట్లో ఏది చేసినా సరే.. ముందే ఈ దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి.
హోలీ రోజు ఎవరినీ అనుమానించొద్దు. అందరినీ సహృదయంతో పలకరించుకోవాలి. ముఖ్యంగా ఆ రోజు పసుపు, ఆవాలతో పాటు జాజికాయ లాంటి వాటిని జేబులో పెట్టుకోవాలి. వీలైతే వీటన్నింటినీ నల్లని వస్త్రంలో కట్టుకుని పెట్టుకుంటే ఇంకా మంచిది. అంతకు ముందు రోజు చాలా ఏరియాల్లో కాముడిని కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా కాల్చిన బూడిదను ఇంటికి తెచ్చుకోవాలి.
ఇలా తెచ్చుకున్న బూడిదను ఇంటి నాలుగు మూలల్లో చల్లుకోవాలి. దాని వల్ల వాస్తు దోషాలు నివారించబడుతాయి. అయితే ఇష్టం వచ్చినట్టు రంగులు పూసుకోకుండా.. పెద్దల పాదాలకు రంగులు పూసి వారి ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా మంచిది. ఇలా చేస్తే ఆ దేవ దేవుడు ఇంకా సంతోషపడి కోరిన వరాలు నెరవేర్చుతాడంట. హోలీ నాడు ఆంజనేయుడిని ఆరాధించాలి. కామధన రాత్రి ఆంజనేయుడి పూజ చేస్తే ఇంకా మంచిది.
Also Read: జనసేన ఆవిర్భావ సభ మార్గదర్శకాలు
చేయకూడనివి..
హోలీ పండుగ నాడు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు హాని తలపెట్టొద్దు. కచ్చితంగా తెల్ల రంగులో ఉండే వస్తువులకు చాలా దూరంగా ఉండాలి. ఇక సాయంత్రం లోపే హోలీని ముగించాలి. ఆ తర్వాత ఇంట్లోనే ఉండాలి. లేదంటే అరిష్టం అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా హోలీ పండుగ నాడు మద్యం సేవించొద్దు. హోలీ నాడు ఎవరినీ డబ్బులు అడగొద్దు, ఇవ్వొద్దు.

Also Read: పొత్తులపై ‘జనసేన’ క్లియర్ కట్.. సస్పెన్స్ కు తెరదించే అవకాశం?