Kailash Gahlot: దేశ రాజధాని, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తోపాటు, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఢిల్లీ పీటం దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాయి. మద్యం కుంభకోణం కేజులో ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశాడు. ఆయన స్థానంలో తన కేబినెట్‌లో మంత్రిగా ఉన్న అతిషికి బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఎన్నికల వేళ.. ఆప్ పార్టీలో కుదుపులు మొదలయ్యాయి. వరుసగా మూడుసార్లు ఢిల్లీలో గెలిచి పట్టు సాధించిన ఆప్.. ఈసారి పట్టు సడలే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఆ పార్టీలో ఉంటూనే ఎంపీ, ఎమ్మెల్యేలు, నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేబినెట్ మంత్రి కైలాష్ గహ్లోట్ పదవికి రాజీనామా చేయడంతోపాటు పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆప్‌పై ఆరోపణలు చేశాడు. వివాదాలు, నెరవేర్చని వాగ్దానాలు ప్రభుత్వం వదిలేసిందని ఆరోపించారు. కలుషితమైన యమునా నది, షీప్‌మహల్ వివాదాలను ఇందుకు ఉదాహరణగా తెలిపారు. ఢిల్లీ ప్రజలకు సేవ ను కొనసాగించేందుకే తాను పార్టీ మారానని సమర్థించుకున్నారు.
సీఎం రేసులో ఉండి..
వాస్తవానికి కైలాష్ గహ్లోథ్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత సీఎం పదవి ఆశించారు. సీనియర్ నేతగా సీఎం పదవి వస్తుందని భావించారు. కానీ కేజ్రీవాల్ మాత్రం అతిషివైపే మొగ్గు చూపారు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉంటున్న గహ్లోథ్.. చివరకు పార్టీని వీడారు. బీజేపీ ఆప్‌ను ఇప్పటికే అన్ని విధాలా టార్గెట్ చేసింది. ఈ సమయంలో ఆయన బీజేపీలోనే చేరారు.
కేబినెట్‌లోకి రఘువీందర్..
గెహ్లాట్ రాజీనామాతో ఢిల్లీ కేబినెట్‌లో ఖాలీ అయిన స్థానాన్ని సీఎం అతిషి రఘువీందర్ షోకీన్ నంగ్లోయ్‌తో భర్తీ చేసింది. జాట్ సామాజికవర్గం ఎమ్మెల్యే రఘువీందర్. ఈమేరకు ఆయన సోమవారం మంత్రిగా ప్రమాణం చేశారు. ఆప్‌లో ప్రముఖ జాట్ నాయకుడిగా ఉన్నారు. గెహ్లోట్ రాజీనామా చేసిన 234 గంటల్లోనే సీఎం అతిషి ఆ స్థానాన్ని బలమైన సామాజికవర్గ ఎమ్మెల్యేతో భర్తీ చేయడం గమనార్హం.