Phone Get a Red Light: నేటి కాలంలో మొబైల్ వాడని చేతులు ఉండవు. ఏ పని చేయాలన్నా.. స్మార్ట్ ఫోన్ ను కచ్చితంగా వాడుతున్నారు. మనీ ట్రాన్స్ ఫర్ కోసం కూడా మొబైల్ వాడుతున్నారు. అయితే సర్వం సమప్తం మొబైల్ లో ఉండడం వల్ల దీనిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఫోన్ లోని డేటా చోరీ కాకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ఎంతో జాగ్రత్తగా ఉన్నా.. కొందరు హ్యాకర్లు ఫోన్ లోని సమాచారం దొంగిలిస్తూ ఉంటారు. అయితే ఫోన్ లోని డేటా చోరీ అయ్యే ముందు కొన్ని సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఫోన్ ఆగిపోవడం.. రిస్టార్ట్ అవడం.. కొత్త యాప్ లు ఇన్ స్టాల్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్త మొబైల్ లోని ఫ్రంట్ కెమెరాలో వివిధ సిగ్నల్స్ వస్తున్నాయి. వీటి అర్థం ఏంటంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఫ్రంట్ కెమెరాలో రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇదేంటో తెలియక ఆందోళన చెందుతారు. అ తరువాత గ్రీన్ లైట్ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఆరేంజ్ లైట్ వస్తుంటుంది. ఈ సిగ్నల్స్ ఫోన్ హ్యాక్ అయ్యే ముందు వచ్చే సిగ్నల్స్. ఇవి వస్తుంటే ఫోన్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందని అర్థం. అయితే ఇందులో గ్రీన్ లైట్ వస్తుందంటే.. ఫోన్ వాడుతున్న వ్యక్తుల తో సంబంధం లేకుండా ఫోన్ లోని కెమెరా ఆధారంగా డేటాను చోరీ చేస్తున్నారని అర్థం. రెడ్ లైట్ వెలుగుతున్నప్పుడు ఫోన్ లోని ఏదైనా ఒక యాప్ ఫోన్ వ్యక్తులతో సంబంధం లేకుండా వాడుతున్నారని అర్థం. అలాగే ఆరేంజ్ లైట్ వస్తుందంటే. ఓ యాప్ తో వాయిస్ ను రికార్డు చేసే అవకాశం ఉంది.
అయితే ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలనేది చూద్దాం.. ఒకవేళ ఐ ఫోన్ యూజ్ చేస్తున్న వారైతే.. Settings లోకి వెళ్లి Privacy & Security ని క్లిక్ చేయాలి. ఇప్పుడు కెమెరా అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అవసరం లేని యాప్ లకు కెమెరా యాక్సెస్ ను తీసేయాలి. అలాగే మైక్రోఫోన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత యాప్ లకు ఉన్న మైక్రోఫోన్ యాక్సెస్ ను తీసేయాలి. ఒకవేళ ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేసేవారు అయితే settings లోకి వెళ్లి పర్మిషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఆ తరువాత కెమెరా అనే దానిపై క్లిక్ చేయాలి. ఇక్కడ అవసరం లేని యాప్ లకు కెమెరా పర్మిషన్ తీసేయాలి.
ఇలా కొత్తగా కనిపించే యాప్ లకు కెమెరా, మైక్రోఫోన్ యాక్సెస్ ను తీసేయాలి. ఇలా చేయడం వల్ల ఆ యాప్స్ ఎలాంటి వీడియో లేదా వాయిస్ రికార్డ్ చేయవు. అయితే వాట్సాప్, ఇతర కమ్యూనికేషన్ యాప్స్ కు మాత్రం ఇవి Allow చేయాలి. లేకుంటే ఇతరులకు ఆ వాయిస్ వినిపించదు. లేదా ఫోటోస్, వీడియోస్ పంపించుకోవాలంటే కుదరదరు. కొత్తగా మీకు సంబంధం లేని యాప్స్ కనిపిస్తే అందులో ఇవి కచ్చితంగా యాక్సిస్ అనేది తీసేయడం చాలా మంచిది.