https://oktelugu.com/

YS Jagan : బిజెపి కోసం చివరిదాకా.. జగన్ ఆలోచన అదే!

ఏపీ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పాత్ర పెరుగుతోంది. ఆ పార్టీ అన్ని రాజకీయ పార్టీలకు అవసరం అవుతోంది. ఇది గుర్తు ఎరిగిన జగన్ బిజెపితో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 18, 2024 / 12:06 PM IST

    Jagan

    Follow us on

    YS Jagan : వైసిపి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని భావిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో అందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ముఖ్యంగా ఏపీలో కూటమి బలంగా ఉంది. మూడు పార్టీల మధ్య సఖ్యత బాగానే కొనసాగుతోంది. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఇదే మాదిరిగా దెబ్బతిన్నారు. దానిని గుణపాఠంగా మలుచుకొని గత ఐదేళ్లుగా అనేక రకాల వ్యూహాలు పన్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని తన దారిలోకి తెచ్చుకున్నారు. అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దనుకున్న బీజేపీని ఒప్పించగలిగారు. ముఖ్యంగా పవన్ సేవలను సరైన సమయంలో సద్వినియోగం చేసుకున్నారు. పవన్ ద్వారా బిజెపిని తన రూట్లోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఫార్ములానే జగన్ కూడా అనుసరిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో టిడిపి కూటమి రాష్ట్రంలో గెలిచింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి టిడిపి కారణమైంది. ఇది అంత ఈజీగా సాధ్యం కాలేదు. గత ఐదేళ్లుగా చంద్రబాబు అనేక రకాల వ్యూహాలు అనుసరిస్తూ వచ్చారు. బిజెపి స్నేహాన్ని అందుకోగలిగారు. ఆ స్నేహంతోనే మళ్లీ అధికారంలోకి రాగలిగారు. దానిని గుర్తు చేస్తూ జగన్ ఇప్పటికీ బీజేపీతో సఖ్యత గానే కొనసాగాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బిజెపి స్నేహాన్ని వదులుకోకూడదని.. చివరి వరకు అదే పరిస్థితిని కొనసాగించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. తాజాగా జమిలీ బిల్లుకు లోక్సభలో మద్దతు తెలపడం ద్వారా తాను ఇంకా బీజేపీతో స్నేహాన్ని వదులుకోలేదని సంకేతాలు ఇచ్చారు.

    * చంద్రబాబు కీలక భాగస్వామి
    మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలక భాగస్వామి. అది కొట్టి పారేయలేని అంశం. కానీ సరిగ్గా ఐదేళ్ల కిందట జగన్ ఏపీలో అధికారంలోకి రాగలిగారు. అప్పుడు జగన్ కు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు కేంద్ర ప్రజలు. ఇప్పుడు చంద్రబాబు మంచి మెజారిటీతో విజయం సాధించగలిగారు. ఇప్పుడు కేంద్ర పెద్దలతో గౌరవించబడుతున్నారు. అంటే ఏపీలో ఎవరి బలం ఉంటే వారి వైపు కేంద్రం మొగ్గు చూపునట్టే కదా? ఒకవేళ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికిఏపీలో వ్యతిరేక పవనాలు వీస్తే.. తప్పకుండా జగన్ బలపడతారు. అదే జరిగితే జగన్ వైపు బిజెపి మొగ్గు చూపదని గ్యారెంటీ ఏంటి? విశ్లేషకులు సైతం ఇదే రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని చెబుతున్నారు.

    * ఒకవేళ బిజెపి బలపడాలంటే
    ఏపీలో బిజెపి బలపడాలంటే తప్పకుండా వైసీపీ ద్వారా అది సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే బిజెపితో కలిసేందుకు వైసిపి ఎంతకైనా తగ్గే అవకాశం ఉంది. 25 పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ సీట్లు బిజెపికి విడిచి పెట్టమన్నా జగన్ విడిచి పెట్టే అవకాశం ఉంది. పైగా నియోజకవర్గాల పునర్విభజనతో ఇప్పుడున్న 175 స్థానాలు.. 225 కు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ బిజెపితో పొత్తుకు వైసిపి ముందుకు వస్తే సింహభాగం ప్రయోజనాలు వదులుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఏపీలో బిజెపి బలపడే ఛాన్స్ ఉంటుంది. అయితే అది ఇప్పటికి ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి మాత్రం లేదు. దీనికి కొంత కాలం ఆగాల్సిందే. అయితే జగన్ చేస్తోంది అదే. జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించింది. కానీ అదే సమయంలో బ్యాలెన్స్ పాటించడం ప్రారంభించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా.. బిజెపితో స్నేహం వదులుకోకూడదని బలంగా నిర్ణయించారు. నిన్నటి జమిలి బిల్లుకు స్వచ్ఛందంగా మద్దతు తెలపడం అందులో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.