Name Astrology: మీ పేరులో మొదటి అక్షరాలు వీటితో మొదలవుతున్నాయా? అయితే 2024లో ఎలా ఉంటుందో తెలుసా?

P మీ పేరు P అక్షరం తో మొదలైతే ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది. ఏవైనా పెద్ద పెద్ద పనులు పెట్టుకున్నా కూడా విజయం మీ సొంతమే. ప్రేమను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.

Written By: Suresh, Updated On : December 29, 2023 3:34 pm

Name Astrology

Follow us on

Name Astrology: కొత్త సంవత్సరం వస్తుంది అంటే వచ్చే సంవత్సరం ఏం చేయాలి? ఈ సారి చేసిన తప్పులు మళ్లీ చేయకుండా ఎలా ఉండాలి అంటూ ఎన్నో రకాల ఆలోచనలతో ఉంటారు. అంతేకాదు జాతకం ఎలా ఉందంటూ కూడా ఆలోచిస్తారు. కొందరు పండితులను సంప్రదిస్తారు. అయితే జాతకంతో పాటు మీ పేరులోని మొదటి అక్షరంతో ఈ సారి మీకు ఎలా ఉందో తెలుసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ పేరులో ఈ అక్షరాలు ఉన్నాయా? ఉంటే ఎలా ఉంది అనే వివరాలు కింద ఉన్నాయి ఆలస్యం చేయకుండా చదివేయండి.

P మీ పేరు P అక్షరం తో మొదలైతే ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది. ఏవైనా పెద్ద పెద్ద పనులు పెట్టుకున్నా కూడా విజయం మీ సొంతమే. ప్రేమను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక P అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే ఆత్మీయంగా ఉంటారట. మంచిగా మాట్లాడుతారు. తమాషాగా అందరిని మెప్పిస్తారని ఈ సంవత్సరంలో ఆర్థికంగా కూడా కలిసి వస్తుందని తెలుస్తోంది.

R ఈ అక్షరం పేరు మొదట్లో ఉన్నవారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. డబ్బు వస్తుంది కానీ పేరు రాదు. ప్రేమలో కూడా కొత్తగా ఏమి జరగదు. కానీ ఆర్థిక ఒత్తిడి పడిపోతుంది కానీ తెలివిగా ఖర్చు పెట్టండి. సహనంతో కూడి ఉంటారు. తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ఆలోచించి అడుగులు వేయండి.

S ఈ అక్షరంతో మీ పేరు మొదలైతే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. జీవితంలో కొత్త అవకాశాలు వస్తుంటాయి. అత్యుత్తమంగా ఉంటారు. కానీ ప్రేమ విషయంలో కాస్త డీలా పడాల్సిందే. కానీ ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఇక ఈ అక్షరం ఉన్నవారు పని చేయడానికి ఆసక్తిగా ఉంటారు. కొత్తగా ఆలోచిస్తుంటారు. ఇక నంబర్ వన్ అవ్వాలంటే కాస్త ఇతరుల మాట వినండి. కానీ మీకే ప్రాధాన్యత ఇవ్వండి.

M ఈ అక్షరంతో మీ పేరు మొదలైతే చెడు కలయికగా ఉంటుంది. గృహ అశాంతి పెరుగుతుంది. బయట పని చేస్తే ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇక ఏదైనా బాధ్యత తీసుకుంటే కచ్చితంగా నిర్వహిస్తారు. స్వతంత్ర్యంగా పని చేయడానికి ఇష్టపడుతారు. ఇతరులతో పని చేసినా.. ఆర్డర్స్ నచ్చవు. కానీ చాలా నిజాయితీగా ఉంటారు.

H మీ పేరులో మొదటి అక్షరం H అయితే కొత్తగా ఏమి జరగదు. కానీ కోపాన్ని మాత్రం తగ్గించుకోవాలి. లేకపోతే పెద్ద నష్టమే జరుగుతుంది. డబ్బు అతిగా ఖర్చు పెట్టడం మంచిది కాదు. తెలివిగా ఖర్చు పెట్టండి. ఇక వీరు సృజనాత్మకంగా ఆలోచిస్తారు. విజయం సాధించకపోయినా ఉత్సాహం మాత్రం ఫుల్ గా ఉంటుంది.