Geetu Royal: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీజన్ 6 విన్నర్ అవ్వాలని హౌస్ లో అడుగుపెట్టిన గీతూ చేసిన అతి అంతా ఇంతా కాదు. దీంతో ఆడియన్స్ ఆమెను 9వ వారంలోనే బయటకు పంపేశారు. అలా సీజన్ 6 లో ఇరిటేటింగ్ కంటెస్టెంట్ అనిపించుకున్నప్పటికీ .. ఈ ఉల్టా పుల్టా సీజన్ లో బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని తనదైన రీతిలో ఇంటర్వ్యూ చేసి హాట్ టాపిక్ గా మారింది.
ఎవరూ అడగని ప్రశ్నలు కంటెస్టెంట్స్ ని ఫేస్ టు ఫేస్ అడిగి కడిగి పారేసింది గీతూ. తన గలాటా ప్రశ్నలతో ఒక్కో కంటెస్టెంట్ కి చుక్కలు చూపించింది. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతూ రాయల్ ఆసక్తి కరమైన విషయాలు పంచుకుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ గురించి, బిగ్ బాస్ బజ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా బజ్ లో అడిగే ప్రశ్నలు తాను ప్రిపేర్ చేసుకున్నవి కావని తెలిపింది. అయితే ఈ షో ప్రారంభం మొదటి వారం నుంచి అనేక వచ్చాయట. ఆ సమయంలో కాకినాడలో ఉన్న తన తల్లి కి అనారోగ్యం సమస్యలు రావడం తో అక్కడే ఉండి .. కేవలం షూటింగ్ టైం లో మాత్రమే హైదరాబాద్ కు వచ్చేదట. ఇన్ని టెన్షన్స్ మధ్య బిగ్ బాస్ షో చూడలేదట. దీంతో ఆమె స్నేహితుల సహాయం తీసుకుందట.
ఇందుకోసం ఆమె రివ్యూవర్ ఆది రెడ్డి హెల్ప్ తీసుకుందట. అలాగే ఫణి అనే మరో అబ్బాయి .. ఇంకో ఇద్దరు ముగ్గురు స్నేహితులు సాయం చేసేవాళ్లట. అలా వాళ్ళు రాసిచ్చిన ప్రశ్నలలో నుంచి కొన్ని సెలెక్ట్ చేసుకుని కంటెస్టెంట్స్ ని అడిగేదాన్ని అని గీతూ వెల్లడించింది. అయితే ఆ ప్రశ్నలు తన దగ్గరకు వచ్చే సరికి చాలా ఆలస్యం అయ్యేదని, ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే గంట ముందు ప్రశ్నలు వచ్చేవని సీక్రెట్ బయట పెట్టింది గీతూ రాయల్.