Lizards: మనందరి ఇళ్ల్లల్లో బల్లులు ఉంటాయి. బల్లులు లేకపోతే కూడా మనకు నష్టమే. కానీ బల్లుల విషయంలో కొన్ని అపోహలు మాత్రం ఉన్నాయి. అవి కనబడితే అపశకునంగా భావిస్తారు. ఇంటికి బల్లులకు ఎంతో సంబంధం ఉంది. బల్లులు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి వారి ఇంట్లో బల్లులు ఉండటం సహజమే. ఇంట్లో బల్లులు లేకపోతే కూడా అనర్థాలే వస్తాయి. కీటకాలను తినడంలో బల్లులదే ప్రధానపాత్ర. దీంతో అవి మన ఇంట్లో ఉంటేనే మన ఇల్లు సురక్షితంగా ఉంటుందని తెలుసుకోవాలి.

మన ఇంట్లో ఉండే కీటకాలను నాశనం చేస్తుంటాయి. కీటకాలు లేకపోతే కూడా కష్టమే. వాటిని బల్లు తింటాయి. బబ్లులను పక్షులు తింటాయి. ఇలా కాలచక్రంలో చిన్న వాటిని పెద్దవి తినడం సహజమే. బల్లులు మన ఇంట్లో ఉండే కీటకాలను నిర్మూలిస్తాయి. కీటకాల నియంత్రణలో బల్లులదే ప్రధాన భూమిక. కీటకాలు ఎక్కువైతే కూడా మన ఇల్లు వాటికి ఆవాసంగా మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే బల్లులు వాటిని తింటూ అవి మన ఇంట్లో ఉండకుండా చేస్తాయి. దీంతో మనకు లాభాలే ఉంటాయి.
బల్లులు అపశకునంగా భావిస్తారు. ఎటైనా వెళ్లేటప్పుడు బల్లి ఎదురైతే అశుభంగా చెబుతుంటారు. కానీ ఇదంతా అపోహే. బల్లి ఎదురుపడితే ఎలాంటి నష్టం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఆహారంలో బల్లి పడితే అది విషపూరితం అవుతుందని మరో వాదన కూడా ఉంది. కానీ ఇందులో కూడా నిజం లేదు. బల్లి పడితే సాధారణంగా వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. కానీ ప్రాణాపాయం మాత్రం కాదు. దీంతో బల్లి పడిన ఆహారం తింటే ఏదో అవుతుందని అందరిలో అనుమానాలు మాత్రం ఉన్నాయి.

శకునం చెప్పే బల్లి కుడిదిలో పడిందని సామెతగా కూడా చెబుతుంటారు. శకునాలు చెప్పడంలో కూడా బల్లులకు ప్రధాన పాత్ర ఉంది. అవి ఉత్తరం, తూర్పు వైపు పలికితే శుభమని, పడమర, దక్షిణం వైపు పలికితే అశుభమని భావిస్తుంటారు. పూర్వం రోజుల్లో అయితే బల్లి పలుకులను కూడా శకునంగా భావించిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బల్లి గురించి అన్ని అపోహలే కానీ అసలు విషయాలు మాత్రం పట్టించుకోవడం లేదు. పర్యావరణ పరిరక్షణలో బల్లులది కూడా ముఖ్యమైన పాత్రగానే గుర్తించాల్సి ఉంటుంది.