shopping : షాపింగ్ అంటే నచ్చని వారు ఎవరు అయినా ఉంటారా? ప్రతి ఒక్కరికి షాపింగ్ అంటే చాలా ఇష్టమే. కానీ షాపింగ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటారా? బడ్జెట్ అండీ బాబు. మన బడ్జెట్ కు షాపింగ్ చేయడం చాలా కష్టం. కలెక్షన్లు ఏమో ఎక్కువ బడ్జెట్ ఏమో తక్కువ. ఏదైనా షాప్ కు వెళ్తే మంచి మంచి కలెక్షన్లు ఊరిస్తుంటాయి. కానీ పర్సు ఏమో నిరాశ పరుస్తుంది. వద్దు వద్దు ఆ వైపు వెళ్లవద్దు అని చెబుతుంటుంది. అందుకే మనకు అందుబాటులో ఉండే మార్కెట్ కు వెళ్లాలి. అయితే ఈ మధ్య ఆన్ లైప్ షాపింగ్ లు ఎక్కువ అవుతున్నాయి. లేదంటే ఏ మార్కెట్ లో తక్కువ ధరకు లభిస్తాయని సర్చ్ చేసి మరీ వెళ్లేవారు. అయితే ఎక్కువ మొత్తంలో బట్టలు కావాలంటే ఢిల్లీకి వెళ్లండి. అక్కడ చాలా మార్కెట్ లు చాలా చీప్ రేట్ లో దుస్తులు లభిస్తాయి. అవి కూడా మంచి మంచి కలెక్షన్లు అందుబాటులో ఉంటాయి. వెడ్డింగ్ షాపింగ్ కోసం, ముఖ్యంగా గౌన్ల కోసం వివిధ రకాల సరసమైన మార్కెట్లు ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్తే మీకు చాలా తక్కువ రేటులోనే అన్ని వస్తువులు లభిస్తాయి. ఇంతకీ అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకుందాం.
చాందినీ చౌక్ మార్కెట్ కు వెళ్తే మీ అన్ని వివాహ అవసరాల కోసం ఒక స్టాప్ షాప్ లభించినట్టే. అద్భుతమైన డిజైనర్ లెహంగాలు, చీరలు, ఆభరణాలను సరసమైన ధరలకు అందిస్తోంది ఈ మార్కెట్. మీకు నచ్చే ప్రతి కలెక్షన్ కూడా ఇక్కడ లభిస్తుంది.
లజపత్ నగర్ మార్కెట్ లో కూడా సరసమైన ధరలే ఉంటాయి. ఈ మార్కెట్ బడ్జెట్-స్నేహపూర్వక ధరలలో రెడీమేడ్, అనుకూలీకరించిన గౌన్లను అందిస్తుంది. కాబోయే వధువులు, కుటుంబ సభ్యులకు సరైన షాపింగ్ ప్రదేశం అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇదే డిల్లీలో కరోల్ బాగ్ మార్కెట్ కు వెళ్లిన మంచి ధరలలో మీకు బట్టలు లభిస్తాయి. వెడ్డింగ్ కలెక్షన్‌లకు ప్రసిద్ధి చెందింది ఈ మార్కెట్. మీరు అజ్మల్ ఖాన్ రోడ్ వంటి దుకాణాలలో స్టైలిష్ గౌన్‌లను చూడవచ్చు. ఇక్కడ టైలర్లు డిజైన్లను కూడా అందిస్తారు.
రాజౌరి గార్డెన్ మార్కెట్ వెడ్డింగ్ షాపింగ్ కోసం ఒక మంచి వీధి. అందుబాటు ధరలో లెహంగాలు, చీరలు, ఆభరణాలను లభిస్తాయి. సౌత్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో బోటిక్‌లు, దుకాణాలు ఉన్నాయి. ఇవి ఆధునిక డిజైన్‌లతో అధునాతన వెడ్డింగ్ గౌన్‌లను అందిస్తాయి. వివిధ బడ్జెట్‌లలో వివిధ రకాలు లభ్యం అవుతాయి. సరోజినీ నగర్ మార్కెట్ సరసమైన ఫ్యాషన్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ మార్కెట్ స్టైలిష్ గౌన్‌లను కూడా అందిస్తుంది. ఇక షాపూర్ జాట్ డిజైనర్ బోటిక్‌లకు నిలయం అని చెప్పవచ్చు. ఈ మార్కెట్ విలాసవంతమైన దుకాణాల కంటే తక్కువ ధరలకు ప్రత్యేకమైన వెడ్డింగ్ గౌన్‌లను అందిస్తుంది.
కమల నగర్ మార్కెట్ కు వెళ్లిన మీకు సరసమైన ధరలకే మంచి మంచి దుస్తులు లభిస్తాయి. కావాల్సిన బట్టలు అక్కడ మీకు మీ బడ్జెట్ లో లభిస్తాయి. వధువు- వరుడు దుస్తులను అందిస్తుంది ఈ మార్కెట్. మీ పెళ్లి రోజును మరిచిపోలేని విధంగా చేయడానికి మీరు అద్భుతమైన లెహంగాలు, షేర్వాణీలు, పాగ్రీలను కొనుగోలు చేసి హ్యాపీగా ఇంటికి వెళ్లవచ్చు.