Homeలైఫ్ స్టైల్Loneliness: ఒంటరితనం వేధిస్తుందా? ఇలా చేయండి..

Loneliness: ఒంటరితనం వేధిస్తుందా? ఇలా చేయండి..

Loneliness: మనలో చాలా మందికి ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు. కొందరికైతే పిచ్చి లేస్తుంది. ఒంటరి తనం అలవాటు ఉన్న వారికే అది సాధ్యమవుతుంది. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎన్నో విషయాలపై శ్రద్ధ చూపొచ్చు. ఎన్నో పనులు చేసుకోవచ్చు. పెండింగు పనులు పూర్తి చేసుకోవచ్చు. ఒంటరిగా ఉన్నాం ఏం తోచడం లేదు అనే వాదనను పక్కన పెట్టండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలు మనల్ని వేధిస్తుంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు మనకు నచ్చిన ఎన్నో పనులు చేసుకుని ఒంటరి తనాన్ని దూరం చేసుకోవచ్చని తెలుసుకోవాలి.

Loneliness
Loneliness

ఒంటరిగా ఉన్నప్పుడు కాసేపు నడవండి. అది కూడా కొత్త ప్రదేశాలకు ఎంచుకోవడం మంచిది. ఇంకా వంట నేర్చుకుని కొత్త కొత్త వంటలు ప్రయత్నిస్తే కూడా ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఒక పనిలో నిమగ్నం అయితే మనకు ఒంటరి తనం అనేది గుర్తుకు రాదు. మనం చేసే పనిలోనే సమయం గడిచిపోతుంది. అదే ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ ఉంటే మాత్రం అదే బాధిస్తుంది. వెరైటీ వంటకాలు చేస్తూ ఉంటే వాటి రుచి కూడా మనకు తెలిసిపోతుంది. పనులు చేయడం మనకు ఎంతో తృప్తిని ఇస్తుంది.

పూర్వం రోజుల్లో ఆత్మీయులకు అందంగా ఉత్తరాలు రాసుకునే వారు. దీంతో ఎంతో సమయం దాని కోసం కేటాయించేవారు. దీంతో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగేది. ప్రస్తుతం వాటి కాలం దాదాపు అంతరించింది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన చేత్తో ఏదో ఓ ఉత్తరం రాస్తే బాగుంటుంది. దీంతో మన మెదడుకు పని చెప్పినట్లు అవుతుంది. ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ రాదు. ఏం తోచకపోతే నెలవారి పద్దులు రాసుకోండి. నెలకు ఎంత ఖర్చవుతుందనే దానిపై ఓ ప్రణాళిక వేసుకోవాలి. దీంతో సమయం ఆదా అవుతుంది.

Loneliness
Loneliness

మన లక్ష్యాలను ఓ సారి బేరీజు వేసుకోండి. జీవితంలో మనం ఏం సాధించాలి. దాని కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఏ విధంగా కష్టపడితే మన గమ్యం చేరుతాం. విజయం సాధిస్తే మనకు వచ్చే ప్రశంసలను గుర్తు చేసుకుంటే మనసు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎన్నో విషయాలపై దృష్టి సారించుకోవచ్చు. ఇంకా ఇంటిని శుభ్రం చేయండి. మంచి సంగీతం వింటే కూడా మనసు ఎంతో తృప్తిగా మారుతుంది. పుస్తకం చదవడం కూడా మంచి అలవాటే. పుస్తక పఠనం చేస్తే మనకు సమయం విలువ తెలియకుండాపోతుంది. పుస్తకంలో లీనమై మన మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పనులు చేసి దాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Kerala Innovation

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper