Erectile Dysfunction: ఇటీవల కాలంలో వంధ్యత్వం పెరుగుతోంది. పెళ్లయినా పిల్లలు కాని వారి సంఖ్య ఎక్కువవుతోంది. దీంతో సంతాన భాగ్యం కోసం తపిస్తున్న వారు ఎందరో ఉన్నారు. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరిగేందుకు నువ్వుల నూనె ఉపయోగపడుతుంది. స్త్రీలలో ఎన్నో సమస్యలున్నా పురుషుల్లో మాత్రం వీర్య కణాల సంఖ్య మాత్రమే ప్రతిబంధకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పురుషుల్లోసంతాన లేమిని దూరం చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నువ్వుల నూనెలో కాల్షియం, పాస్పరస్, జింక్, ఐరన్, మాంగనీసు, కాపర్, పోలేట్, దయామిన్, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. నువ్వుల నూనెలో ట్రిస్టోపాన్ అనే సేంద్రీయ సమ్మేళనం ఉంటుంది.

పురుషుల్లో ఈ సమస్యలను తగ్గించేందుకు సాయపడుతుంది. నువ్వుల నూనెలో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీర్య కణాల సంఖ్య పురుసుల్లో దాదాపు 50 మిలియన్లు ఉంటే సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఇంకా శుక్ర కణాల కదలికలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే సంతానం కలుగుతుంది. నువ్వుల నూనె పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెంచడానికి సహకరిస్తుంది. నువ్వుల నూనెలో వీటిని పెంచే గుణాలు దాగి ఉన్నాయి. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోతే శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుంది.
నువ్వుల నూనెతో పురుషులు ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. మగవారి శక్తిని బలోపేతం చేసే నువ్వుల నూనెతో పురుషుల శక్తి పెంచడంలో దోహదపడుతుంది. నువ్వుల నూనె వాడకంతో అంగస్తంభన లోపం ఉండదు. జననేంద్రియ సమస్యలతో బాధపడే వారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. నువ్వుల నూనెను జననేంద్రియాలకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. శరీరం వేడిగా మారుతుంది. వీర్య కణాల సంఖ్య సరిగా లేకపోతే హార్మోన్ల సమస్యలు కూడా వస్తాయి.
సలాడ్లలో కూడా నువ్వుల నూనెను వాడుకోవచ్చు. వంటల్లో ఉపయోగిస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నువ్వుల నూనెను శరీరానికి రాసుకుని తరువాత స్నానం చేస్తే మన ఒంట్లోని రోగాలు మాయమవుతాయి. ఈ క్రమంలో నువ్వుల నూనెను వాడుకుంటే మనకు కలిగే ప్రయోజనాలే ఎక్కువ. ఆయుర్వేదంలో నువ్వుల నూనెకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఇలా నువ్వుల నూనె ఉపయోగించుకుని నువ్వుల నూనె వల్ల మన శరీరం వేడిగా అవుతుంది. దీంతో మనకు లైంగిక ఉద్దీపనలు కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

సంతాన లేమి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. వీరికి ఉన్న సమస్యలు చిన్నవే అయినా జీవితంలో సంతానం కలగకపోవడానికి కారణాలు తెలియక సతమతమవుతుంటారు. సరైన విధంగా చికిత్స తీసుకుంటే ప్రతి వారు సంతానం పొందడం సులభమే. దీనికి గాను మనం చేయవలసిందల్లా ఆయుర్వేదంను నమ్మాలి. నువ్వుల నూనెను ఔషధంగా చేసుకుని నిరంతరం వాడితే మనకు ఎన్నో రకాలైన మంచి ఫలితాలు కలగడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని అందరు గ్రహించుకోవాలి.