Sleep: రాత్రి పడుకునేముందు ఇవి తింటే నిద్ర దూరం..

రాత్రిళ్లు చిన్నారులు నిద్రపోవడానికి ఇబ్బందులు పడుతారు. అర్దరాత్రి మెళకువ రావడం లేదా.. మధ్యలో మెళకువ రావడం వంటి సమస్యలు వస్తాయి. అందుకు కారణం వారు పడుకునే ముందు చాక్లెట్ తినడమే.

Written By: Chai Muchhata, Updated On : November 19, 2023 11:50 am

Sleep

Follow us on

Sleep: నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక ఒత్తిడితో కలిగి ఉంటున్నారు. ఉద్యోగాలు, వ్యాపారులు తమ విధుల్లో మునిగి రాత్రి, పగలు అని తేడా లేకుండా విధుల్లో మునుగుతున్నారు. ఈ క్రమంలో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొని నిద్రకు దూరమవుతున్నారు. నిద్రభంగం కావడానికి కేవలం ఒత్తిడి మాత్రమే కాకుండా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడమూ కారణమని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో కొన్నింటిని అకారణంగా తినడం వల్ల నిద్ర దూరమవుతుందని అంటున్నారు. అయితే అవి తింటే ఎలా నిద్రభంగం అవుతుందో చూద్దాం..

రాత్రిళ్లు చిన్నారులు నిద్రపోవడానికి ఇబ్బందులు పడుతారు. అర్దరాత్రి మెళకువ రావడం లేదా.. మధ్యలో మెళకువ రావడం వంటి సమస్యలు వస్తాయి. అందుకు కారణం వారు పడుకునే ముందు చాక్లెట్ తినడమే. చాక్లెట్ తినడం వల్ల నిద్ర భంగం కలుగుతుంది. ఇందులో ఉండే పదార్థాలు నిద్రపోకుండా చేస్తాయి. ఉదయం, మధ్యాహ్న సమయంలో కంటే రాత్రి పూట ఇవి తినడం వల్ల నిద్రపోకుండా ఉంటారని అంటున్నారు.

చిప్స్ ను చూస్తే చిన్నారులు లొట్టలేస్తారు. కొందరు పెద్దవారు కూడా చిప్స్ తినేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతారు. కానీ రాత్రి నిద్రపోయే ముందు చిప్స్ తినడం వల్ల కడుపులో మంట ఏర్పడుతుంది. దీంతో నిద్రపోకుండా అటూ, ఇటూ కదులుతారు. అందువల్ల ఇలాంటి కారం కాలిగిన వస్తువులకు రాత్రి సమయంలో దూరంగా ఉండడమే మంచిది. ఒకవేళ వీటిని తిన్నా మజ్జిగ లాంటివి తీసుకోవడం మంచిది.

ఇక కొందరికి వెల్లుల్లి అంటే మహాఇష్టం కొన్ని కూరల్లో ఎక్కువగా వెల్లుల్లి వేస్తుంటారు. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ రాత్రి సమయంలో ఎక్కువగా వెల్లుల్లి తినడం వల్ల నిద్ర దూరం అవుతుంది. ఇందులో ఉండే భాస్వరం, పోటాషియం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. అందువల్ల రాత్రిపూట ఇవి తీసుకోకుండా ఉండాలి.