Best Hill Stations: ఉరుకుల పరుగుల జీవితానికి కాస్తంత విశ్రాంతి కావాలి. రోజు చేసే పనిలో కాస్తంత ఉపశమనాన్ని శరీరానికి ఇవ్వాలి. లేకుంటే మనిషి రోబోలాగా మారతాడు.. ప్రభుత్వం ఎలాగు మూడు రోజులు క్రిస్మస్ సెలవులు ఇచ్చింది.. ఈ సెలవుల్లో లేజీగా పడుకోక.. దేహాన్ని, దేహాన్ని అంటిపెట్టుకొని ఉండే మనసుని కాస్తంత తేలికపరచండి. ఆ కాలుష్యం బారి నుంచి, వాహనాల రొద నుంచి కాస్తంత ప్రకృతి వైపు మళ్ళించండి. ఈ మూడు రోజులు ప్రయాణం కొత్తగా ఉండాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల్లో ఉన్న ఈ హిల్ స్టేషన్ లకు పయనమవ్వండి.. మీకు సరికొత్త అనుభూతి దక్కుతుంది.

అనంతగిరి కొండలు
హైదరాబాద్ కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ట్రెక్కింగ్ చేసే వారికి ఇది ఒక మంచి అద్భుతమైన టూరిస్ట్ స్పాట్.. క్లయింబింగ్ చేసే వారికి కూడా ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతం. ఇక్కడికి రోజు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు.. ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్, బోటింగ్, క్లయింబింగ్, నాచురల్ వాక్, ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు.. ఇక్కడ భావనాసి చెరువు ఫేమస్.. ఈ కొండలకు పక్కనే వికారాబాద్ పట్టణం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇటీవల రిసార్ట్ లు కూడా వెలిశాయి.. తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తోంది. హైదరాబాదు నుంచి హైవే మీద ఈ ప్రాంతానికి ప్రయాణం చేయవచ్చు.

నల్లమల కొండలు
తెలుగు రాష్ట్రాల అమెజాన్ అడవులుగా ఈ కొండలు ప్రసిద్ధి చెందాయి.. హైదరాబాద్ కు 233 కిలోమీటర్ల దూరంలో ఇవి విస్తరించి ఉన్నాయి.. నల్లమల మీదుగా కృష్ణ, పెన్నా నదులు ప్రవహిస్తాయి.. ఈ నల్లమల అడవుల్లో లెక్కకు మిక్కిలి జలపాతాలు ఉన్నాయి.. ఇక్కడి కంభం సరస్సు చాలా ప్రసిద్ధి చెందింది.. ట్రెక్కింగ్, సైట్ సీయింగ్, ఫోటోగ్రఫీ, కల్చర్ పర్యాటకులకు కొత్త అనుభూతి ఇస్తాయి.. మహానంది, నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

శ్రీశైలం
మల్లికార్జున స్వామి కొలువై ఉన్న ఈ ప్రాంతం హైదరాబాద్ కు 215 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో నల్లమల కొండలు విస్తరించి ఉండటంతో దట్టమైన అడవి ప్రాంతం ఉంటుంది..ఇక్కడి గుహలు ప్రాచీన సాంస్కృతికి ఆనవాళ్లుగా ఉన్నాయి. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కూడా సరికొత్త అనుభూతి ఇస్తుంది. ఇక్కడ అరుదైన మొక్కలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.. నాగార్జునసాగర్, శ్రీశైలం సాం క్చుయరీ, కామేశ్వరి గుడి, శ్రీశైలం డ్యాం, ఉమామహేశ్వరి గుడి ని పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తారు.

600 కిలోమీటర్ల పరిధిలో..
హైదరాబాద్ కు 600 కిలోమీటర్ల పరిధిలో అనేక హిల్ స్టేషన్లు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది లంబసింగి.. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మీదుగా వెళితే ఈ లంబసింగి ప్రాంతం వస్తుంది. దీనిని ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ గా పిలుస్తారు. శీతాకాలంలో ఇక్కడ మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. పైగా అటవీ ప్రాంతం కావడంతో సరికొత్త అనుభూతి ఇస్తుంది. ఇక్కడ రిసార్టులు కూడా వెలిశాయి. బొంగులో చికెన్ ఇక్కడి గిరిజనుల ప్రత్యేక వంటకం. పర్వత ప్రాంతం కాబట్టి కాఫీ తోటలు కూడా విస్తారంగా సాగవుతాయి. ఇక్కడ లభించే కాఫీ అత్యంత శ్రేష్టంగా ఉంటుంది. లంబసింగి ప్రాంతానికి దగ్గరలోనే అరకు ఉంటుంది.. ఇక్కడ బొర్రా గుహలు చాలా ఫేమస్. ఇక్కడ తాజంగి రిజర్వాయర్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది.
హార్స్ లి హిల్స్
హార్స్ లి హిల్స్.. అద్భుతమైన హిల్ స్టేషన్ లో ఒకటి. ఇక్కడ 150 ఏళ్ల కాలం నాటి యూకలిప్టస్ చెట్లను చూడవచ్చు. చూసేందుకు ఇది కాశ్మీర్ ప్రాంతంలా కనిపిస్తుంది. దట్టమైన చెట్లతో నిండా పచ్చదనాన్ని పరుచుకుంటుంది.. ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగ్ జరుగుతుంటాయి.. హైదరాబాద్ కు 514 km దూరంలో ఈ ప్రాంతం ఉంది.. చిత్తూరు జిల్లా పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతం పర్యాటకులకు సరికొత్త అనుభూతినిచ్చే విడిది కేంద్రం.. ఈ ప్రాంతం నుంచి అరుదైన పక్షులను చూడవచ్చు.. ఫోటోగ్రఫీ, రాక్ క్లైమ్బింగ్ ఆఫ్ రోడింగ్ ఇక్కడ ప్రత్యేకతలు.. కౌండిన్య సాంక్చుయరీ, గంగోత్రి చెరువు, చెన్నకేశవ స్వామి గుడి ఇక్కడి ప్రసిద్ధ ప్రాంతాలు..