Astrology: శృంగారమంటే అందరికి ఇష్టమే. సృష్టి మొత్తం శృంగారంలోనే దాగి ఉంది. అందుకే శృంగారాన్ని బంగారంగా భావిస్తుంటారు. భారతీయులకు శృంగారంపై ఆసక్తి మెండుగానే ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ 12 రాశుల వారు శృంగారంలో ఎలా వ్యవహరిస్తారనే దానిపై ఆసక్తికర విషయాలు జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. జాతకంలో చంద్రగ్రహం స్థానాన్ని బట్టి రాశిచక్రాన్ని నిర్ణయించడం మామూలే. పన్నెండు రాశుల వారికి శృంగారంలో ఎలాంటి తీరుగా ప్రవర్తిస్తారో తెలుసుకుందాం.

రాశిచక్రమంలో మొదటగా మేషరాశి వారు ఉంటారు. జీవిత భాగస్వామికి సంతోషాన్ని పంచడంలో వీరికి ప్రథమ స్థానం ఉంటుంది. ప్రేమ వ్యక్తం చేస్తూ భాగస్వామిని సుఖ పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. దీంతో భాగస్వామికి పడక గదిలో సుఖం అందించడానికి ఇష్టపడుతుంటారు. జీవితంలో ఎలాంటి బాధలు లేకుండా చూసుకోవడానికే మొగ్గు చూపుతారు. మేష రాశి వారికి శృంగారాన్ని ఎంజాయ్ చేయడంలో ముందుంటారు. జీవిత భాగస్వామిని బాగా చూసుకుని వారి సుఖమే తమ సుఖంగా భావిస్తుంటారు.
మీన రాశి వారిని శృంగారానికి దేవుడుగా పిలుస్తారు. వీరు శృంగారంలో ఎంతో ఉత్సాహంతో ఉంటారు. కొత్త కొత్త పద్ధతులతో శృంగారాన్ని ఆస్వాదించడంలో వీరికి వీరే సాటి. వీరికి ఎవరు ఉండరు పోటీ. భాగస్వామికి భావప్రాప్తి విషయంలో అద్భుతమైన రీతిలో తమదైన శైలిలో శృంగారంలో పాల్గొంటారు. భాగస్వామిని సంతోషంగా ఉంచుతారు. జీవితంలో వారికి ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాలని కూడా నిర్ణయించుకుని బాగా ప్రేమగా ఆరాధిస్తారు. ఇలా మీన రాశి వారు ఎంతో ఉత్సాహంతో శృంగార జీవితాన్ని నందనవనం చేసుకుంటారు.

పడక గదిలో తిరుగులేని వారిగా కన్య రాశి వారికి పేరుంది. శృంగారాన్ని ప్రయోగాత్మకంగా చేపడతారు. భాగస్వామికి సుఖం అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు. కర్కాటక రాశి వారు కూడా శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారు. ప్రేమను భావోద్వేగాలతో వ్యక్తం చేస్తారు. జీవిత భాగస్వామికి మనసులోని మాట ఎలాంటి భయం లేకుండా వ్యక్తం చేస్తారు. మకర రాశి వారికి శనిదేవుడు అధిదేవుడిగా ఉంటాడు. దీంతో వీరు కూడా శృంగారంలో మంచి ఉల్లాసంతో ఉంటారు. ప్రేమ, శృంగారాన్ని ఒకేలా చూడటం వీరికి అలవాటు.