Stress Free Jobs: ఈ భూమ్మీద బతకడానికి ఏదో ఒక పనిచేయాలి. ఆదాయం హెచ్చుతగ్గులు ఉండోచ్చు.. కానీ ప్రతీ పనిలో కష్టం ఉంటుంది. అయితే చాలా మంది డబ్బును ఆశించేవారు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. కానీ కొందరు డబ్బు అవసరం లేకుండా జీవితం హాయిగా ఉంటే చాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఆదాయం తక్కువ వచ్చినా కన్వినెంట్ జాబ్స్ చూసుకుంటారు. కానీ కొన్ని జాబ్స్ తక్కువ కష్టంతో పాటు ఆదాయమూ ఎక్కువే ఉంటాయి. రోజులో కేవలం 2 నుంచి 3 గంటలు పనిచేస్తే చాలు.. సాఫ్ట్ వేర్ జీతం వస్తుంది. అలాంటి జాబ్స్ రావాలంటే మాత్రం ముందుగా కొంచెం కష్టపడాలి. మరి అలాంటి జాబ్స్ ఏవో తెలుసుకుందామా?
నేడు ప్రతీ రంగంలో టెక్నాలజీ తప్పనిసరి అయింది. ప్రతీ పనిని సాంకేతికతతోనూ పూర్తి చేస్తున్నారు. వ్యవసాయరంగంలోనూ మిషన్లు ఉపయోగించి పంటలు పండిస్తున్నారు. దీంతో అయితే ఒక్క బోధన రంగంలో మాత్రమే ఎంత టెక్నాలజీ వచ్చినా మానవ వనరుల అవసరం తప్పనిసరిగా ఉంటుంది. స్కూలు నుంచి కళాశాల వరకు విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఇప్పటి వరకైతే టీచర్లు, లెక్చరర్లు పాఠాలు చెబుతున్నారు. టీచింగ్ జాబ్ అయితే 8 నుంచి 10 గంటలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇంకొంచె కష్టపడి PhD చేయడం వల్ల మంచి ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని కళాశాలు PhD చేసిన వారిని ప్రత్యేకంగా నియమించుకొని వారితో బోధన చేయిస్తుంది. ఇలా వీరు 2 నుంచి 3 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. కానీ వీరికి లక్షల్లో జీతం ఉంటుంది.
UPSCకి సంబంధించిన ఉద్యోగాలకు లక్షల్లో జీతం ఉంటుంది. కానీ ఒత్తిడి తక్కువగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ శాఖల్లో వర్క్ లోడ్ తక్కువగా ఉండడం వల్ల చాలా మంది ప్రెషర్ లేని జాబ్ కావాలనుకునేవారు వీటిని ప్రయత్నించవచ్చు. అయితే ఇతర ఆదాయాలు మాత్రం తక్కువగానే ఉంటాయి.
నేటి రోజుల్లో ఇన్సూరెన్స్ కంపెనీలో జోరందుకున్నాయి. యాక్సిడెంట్, లైఫ్ తో పాటు ఇతర రకాల ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించడం ద్వారా కళ్లు చెదిరె కమీషన్ పొందవచ్చు. ఒకప్పుడు ఎల్ఐసీ గురించి పెద్దగా అవగాహన లేనివారు పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు చాలా మందికి అవగాహన ఏర్పడింది. దీంతో పాలసీలను కొనుక్కోవడానికి వినియోగారులే ముందుకు వస్తున్నారు. అయితే ఇలాంటి వారిని క్యాచ్ చేయగలిగితే ఆ కమీషన్ మీ సొంతం అవతుుంది. దీనిని చేయడానికి రోజంతా కష్టపడాల్సిన అవసరం లేదు.
ఆడిటర్, AFHQ లాంటి కొన్ని జాబ్స్ కు పని భారం తక్కువగా ఉంటుంది. AFHQ పదోన్నతి పెరిగితే పని భారం ఎక్కువగా ఉంటుంది. కానీ సీనియర్ అడిటర్ గా మారితే పనిభారం తక్కువగా ఉంటుంది. కానీ ఆదాయం మాత్రం అదే స్థాయిలో పెరుగుతుంది. ఇవే కాకుండా రక్షణ విభాగాలకు సంబంధించిన కార్యాలయాల్లో ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అయితే షార్ట్ టర్మ్ లో ఎక్కువగా సంపాదించుకోవాలనుకునవారికి మాత్రం ఇవి వర్తించవు.