
Ulcer and BP: మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాల్లో మిల్లెట్స్ ముఖ్యమైనవి. ఇటీవల కాలంలో వీటిని ఎక్కువగా తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. మిల్లెట్స్ లో ప్రధానమైనవి సజ్జలు. పూర్వం అందరి ఇళ్లల్లో కూడా సజ్జలు ఉండేవి. ఇప్పుడు వరి పండించినట్లే అప్పుడు సజ్జల పంట వేసేవారు. సజ్జలతో రొట్టె, అప్పాలు, సంకటి, దోశలు, ఇడ్లీ, రవ్వ, ఉప్మా చేసుకోవచ్చు. సజ్జలను ప్రజలు ఎక్కువగా వాడుతున్నారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ చెబుతోంది. సజ్జలను ఐదు రకాల ఉపయోగాలున్నాయని చెబుతున్నారు.

ఈ రోజుల్లో రోగాల దాడి ఎక్కువవుతోంది. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, గుండెపోటు వంటి రోగాలు బాధిస్తున్నాయి. దీంతో మందులు వాడుతూ వాటిని కంట్రోల్ లో ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. అల్సర్ తో కూడా అవస్థలు పడుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. మన జీవనశైలిలో మార్పుల ఆధారంగానే ఇలాంటి నష్టాల బారిన పడుతున్నాం. ఎరువులు, పురుగుల మందులు, జంక్ ఫుడ్స్, బేకరీ ప్రొడక్ట్స్ వంటి వాటిని తీసుకోవడమే మనకు ప్రతిబంధకంగా మారుతోంది.
సజ్జలను ఆహారంలో చేర్చుకుంటే అల్సర్లు, ఎసిడిటి వంటివి కూడా మన దరికి చేరవు. సజ్జల్లో రక్తపోటును నియంత్రణలో ఉంచే రక్తనాళాలను స్మూత్ గా ఉంచుతాయి. వంద గ్రాముల సజ్జలు తీసుకున్నప్పుడు అందులో మెగ్నిషియం 115 మిల్లీ గ్రాములు లభిస్తుంది. దీంతో పాటు ఫైటోక్ న్యూట్రిషియన్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. సజ్జలు ఆహారంగా తీసుకోవడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.
Also Read: MLC Kavitha Vs BJP: కవిత రివర్స్ గేమ్.. అరెస్టు తప్పదని తెలిసే బీజేపీపై ఎదురు దాడి!
సజ్జలలో ఉండే పాస్పరస్ ఎముకల దృఢత్వానికి పనిచేస్తుంది. కాల్షియంతో పాటు పాస్పరస్ సజ్జల్లో 255 మిల్లీ గ్రాములు ఉంటుంది. పాస్పరస్ ఎముకల్లోకి ఎక్కువగా వెళ్తుంది. పాస్పరస్ బోన్ సెల్స్ ను మరమ్మతు ేయడానికి ఉపయోగపడుతుంది. సజ్జల్లో ఉండే పాస్పరస్ ఆరోగ్యానికి ఎంతో సాయపడుతుంది. అద్భుతమైన సజ్జలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. అందుకే వాటిని తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read: Mukesh Ambani- AP Global Summit: ఏపీ గ్లోబల్ సమ్మిట్ కు ముఖేష్ అంబానీ రావడం వెనుక ట్విస్ట్ అదే?