Pawan Kalyan out of Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) లోకి పంపేందుకు నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’ షోలో బాగా ఫేమస్ అయినటువంటి కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఆర్మీ నుండి సినిమాల్లోకి రావాలనే తపన తో వచ్చానని చెప్పి అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించాడు. అగ్నిపరీక్ష షోలో ఎంతో హుషారుగా ఉంటూ, టాస్కులను అద్భుతంగా ఆడుతూ అందరికంటే మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. హౌస్ లోకి అడుగుపెట్టిన ఆరు మంది సామాన్యులలో, ఆడియన్స్ ఓటింగ్ ద్వారా వెళ్లిన ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఒకరు పవన్ కళ్యాణ్. అలాంటి కంటెస్టెంట్ ఈ వారం ఎలిమినేట్ అయ్యాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు ఇతనికి మొదటి వారంలో మంచి ఊపు ఉన్నింది. కానీ ఆ తర్వాత తగ్గుతూ పోయింది. కారణం ఇతని నుండి ఎలాంటి కంటెంట్ బయటకు రాకపోవడం వల్లే. ఎంతసేపు అమ్మాయిల చుట్టూ తిరగడమే తప్ప, ఇతని నుండి ఆడియన్స్ కి ఎలాంటి ఆట కనపడలేదు.
ఫలితంగా చాలా తక్కువ ఓట్లు వచ్చాయి, ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. కచ్చితంగా ఫైనల్స్ వరకు ఉంటాడు అనే అంచనాలతో వచ్చిన పవన్ కళ్యాణ్ ఇలా మూడవ వారం లోనే ఎలిమినేట్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. నిన్న హౌస్ లోపలకు అగ్నిపరీక్ష షోలో పాల్గొన్న అనూష రత్నం, షకీబ్, దివ్య నిఖిత మరియు నాగ ప్రశాంత్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో కేవలం దివ్య నిఖిత ఒక్కటే కంటెస్టెంట్ గా ఎంపికైంది. అయితే లోపలకు వచ్చిన ఈ నలుగురి ద్వారా పవన్ కళ్యాణ్ కి తన ఆట పెద్దగా లేదని, అసలు అతని కంటెంట్ చూపించడం లేదనే విషయం అర్థం అయ్యింది. అప్పటి వరకు నాకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, నేను టాప్ 5 వరకు వచ్చేస్తాను అనే ధీమా ఉండేది కళ్యాణ్ లో, కానీ నిన్నటి దెబ్బకు ఆయనకు ఒక క్లారిటీ వచ్చేసింది.
ఇకపోతే మూడు వారాలు ఉన్నందుకు గానూ, పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్, అంటే వారానికి 70 వేల రూపాయిలు అన్నమాట. ఒక్కమాట లో చెప్పాలంటే బిగ్ బాస్ షో కళ్యాణ్ కి అసలు ఉపయోగపడలేదు. ఒక సెలబ్రిటీ స్టేటస్ అయితే వచ్చింది కానీ , ఈ షో ద్వారా సినిమా అవకాశాలు సంపాదించాలి అనే అతని కల మాత్రం నెరవేరడం కాస్త కష్టం అనే చెప్పాలి. మంచి టాలెంట్ ఉంది, కానీ సరైన ఫోకస్ లేకపోవడం వల్ల ఇలా అయ్యింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.