Astrology Tips: నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది

ఉదయం నిద్ర లేచిన తరువాత వెంటనే రెండు చేతులు పట్టుకుని కరాగ్రే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే బ్రహ్మ ప్రభాతే కరదర్శనం అని మంత్రాన్ని పఠిస్తే మంచిది.

Written By: Srinivas, Updated On : June 23, 2023 10:54 am

Astrology Tips

Follow us on

Astrology Tips: మనం ఉదయం నిద్ర లేనిచ వెంటనే కొన్ని పనులు చేయాలి. వాటితో మనకు సంకల్ప బలం పెరుగుతుంది. రోజంతా పనులు బాగా జరిగేందుకు కారణమవుతుంది. సులభమైన చిట్కాలే కానీ మనకు కొండంత అండగా నిలుస్తాయి. వాటిని పాటిస్త మనకు రోజంతా సవ్యంగా జరుగుతుందని మన పండితులు చెబుతుంటారు. మన అలవాట్లు మన వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి. మనం చేసే పనులే మన పిల్లలకు అలవాటవుతాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే మన ధర్మశాస్రాల ప్రకారం అత్యంత పవిత్రమైన అహల్య, ద్రౌపది, కుంతి, తారా, మండోదరి పేర్లను తలుచుకోవాలి. వీరిని పంచకన్యలు అంటారు.

ఉదయం నిద్ర లేచిన తరువాత వెంటనే రెండు చేతులు పట్టుకుని కరాగ్రే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే బ్రహ్మ ప్రభాతే కరదర్శనం అని మంత్రాన్ని పఠిస్తే మంచిది. ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని వేదాలు చెబుతున్నాయి. లేచిన తరువాత భూదేవికి నమస్కారం చేసుకోవడం మరవద్దు. మొదటి అడుగు వేయగానే భూదేవిని నమస్కరించుకోండి.

ఈ రోజుల్లో అందరు లేవగానే సెల్ ఫోన్ చూస్తున్నారు. దీంతో నెగెటివ్ ఎనర్జీ వస్తుందని తెలిసినా వదలడం లేదు. ఉదయం నిద్ర లేచాక ముఖం కడుక్కుని భగవంతుడిని పూజిస్తే మన పనులు బాగా జరుగుతాయి. ఇంట్లో ఆవు ఉంటే సేవలు చేయడం చాలా మంచిది. గోవుకు సేవ చేస్తే లక్ష్మీదేవికి చేసినట్లే అంటారు. అందుకే గోవును అంత పవిత్రంగా భావిస్తుంటారు.

ఇలా మనం నిద్ర లేచిన వెంటనే ఇలాంటి పనులు చేయడం వల్ల రోజంతా మనకు ఉత్సాహంగా గడుస్తుంది. ఉదయం మనం చేసే పనులు మనకు రక్షణగా నిలుస్తాయి. ఇవి మన రుషులు కూడా చేసినవే. అందుకే వారికి అంతటి శక్తి ఉండేది. వారు ఎంతో నియమ నిష్టలతో ఉండటం వల్లే వారికి సర్వ విషయాలు తెలిసేవి. మనం మావనమాత్రులం కాబట్టి మనకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని చెబుతారు.