Wakeup: ప్రతి రోజు మనం నిద్ర లేస్తుంటాం. లేచే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మనకు ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. మనం చేసే పనులు మనకు మంచిని కలిగించాలే కానీ చెడు ఫలితాలు ఇవ్వకూడదు. మనం చేయకూడని పనులు చేస్తు మనకు నష్టాలు రావడం ఖాయం. ఈనేపథ్యంలో మనం చేసే పనుల్లో పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకుంటే మంచిది.
ఉదయం నిద్ర లేచేపటప్పుడు కొందరు మంచి జరుగుతుందని మనుషుల ముఖాలు చూస్తారు. అలా చూడటం తప్పు. నిద్ర లేవగానే మన అరచేతులను చూసుకోవాలి. దీంతో రోజంతా మనకు అనుకూల ఫలితాలు రావడం సహజం. అద్దంలో మన ముఖం చూసుకోకూడదు. ఎవరి ముఖం చూడకూడదు. ఇలా ఉదయం లేచిన వెంటనే చేయకూడదు.
మనం పడుకున్నప్పుడు మన జీవ క్రియలు పనిచేయవు. నిద్ర నుంచి లేచాకే వేగం పుంజుకుంటాయి. ఎడమ వైపు తిరిగి లేస్తే గుండెపై ఒత్తిడి పడుతుంది. అందుకే మనం కుడివైపు తిరిగి నిద్ర లేవడం మంచిది లేచిన తరువాత గుడి గంటల ధ్వని, శంకు ధ్వని, గాయత్రి మంత్రం వంటివి వింటే ఎంతో మంచిది. అలా వినడం వల్ల మెదడుకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
నిద్ర లేవగానే నెమలీకలు కలువ పువ్వు, అందమైన వనం కనిపించేలా పడక గదిలో పెట్టుకోండి. భగవంతుని ఫొటో, బంగారం, సూర్యుడు, ఆవు దూడ చూసిన మంచిదే. అందరు సూర్యోదయం కంటే ముందే లేవాలి. నిద్ర లేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేసి దీపం వెలిగించడం ఉత్తమం. నిద్ర లేచిన వెంటనే టీ తాగుతుంటారు. ఇది మంచి అలవాటు కాదు.