Food On Periods: ప్రతి మహిళకు రుతుస్రావం నెలకోసారి వస్తుంది. దీంతో ఆ సమయంలో వచ్చే నొప్పితో బాధపడుతుంటారు. కొందరికి కడుపునొప్పి వేధిస్తుంది. పీరియడ్ కు ముందే వారికి సంకేతాలు వస్తుంటాయి. ఇక ఆ టైంలో పడే బాధతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. పీరియడ్ బాధలు తట్టుకునేందుకు నానా తంటాలు పడతారు. ఈ సమయంలో చాక్లెట్లు తింటే మానసిక స్థితి మెరుగుపడుతుంది. డార్క్ చాక్లెట్లలో సెరోటోనిన్ అనే యాటి డిప్రసెంట్ ఉంటుంది. దీంతో ఉత్సాహం ఉరకలేస్తుంది.

నెలసరి దగ్గరకొస్తున్న కొద్దీ మహిళలకు కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలని అనిపిస్తుంది. ఎక్కువ కేలరీలు ఉన్న చాక్లెట్, కేక్, స్వీట్లు వంటి వాటిని తీసుకోవాలని కోరికగా ఉంటుంది. నెలసరిలో రుతుస్రావం తిమ్మిరి బాధిస్తుంది. దీంతో కడుపునొప్పి, ఒంటి నొప్పులు కూడా వస్తాయి. ఆ సమయంలో పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడతారు. నెలసరిలో స్త్రీలు ఎక్కువగా కోరుకునేది చాక్లెట్లే. దీంతో వారికి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే ప్లేవనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉత్పత్తి చేస్తుంటాయి.
పీరియడ్స్ సమయంలో హార్మోన్ల మార్పులు మనకు సౌకర్యాన్ని ఇచ్చే ఆహారాలను కోరుకోవడం సహజమే. దీంతోనే మహిళలు చాక్లెట్లు తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. పలు అధ్యయనాలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. కళాశాలల్లో చదివే యువతులు వారి పీరియడ్స్ సమయంలో చాక్లెట్లు తింటున్నారని సర్వేలు సూచిస్తున్నాయి. పీరియడ్స్ కు నాలుగు రోజుల ముందు ప్రారంభమయ్యే కోరిక రుతుస్రావం వరకు ఉంటుంది. నిజానికి డార్క్ చాక్లెట్ పీరియడ్స్ సమస్యలను తగ్గిస్తుంది. అందుకే వీటిని ఆశ్రయిస్తుంటారు.

డార్క్ చాక్లెట్లలో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. పీరియడ్ సమయంలో వీటిని ఎక్కువగా తీసుకుంటారు. చాక్లెట్లు తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇందులో యాంటిడిప్రిసెంట్ ఉండటంతో ఉత్సాహం పెంచుతుంది. ఒక రకమైన అనుభూతి కలిగించేందుకు ఇవి దోహదపడతాయి. నెలసరి సమయంలో భరించలేనంత నొప్పి కలుగుతుంది. దీంతో పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడతారు. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. అందుకే చాక్లెట్ తిని ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తారు.
పీరియడ్ సమయంలో తిమ్మిర్లు కూడా వస్తుంటాయి. వీటిని తగ్గించడానికి డార్క్ చాక్లెట్లు ఉపయోగపడతాయి. ఇందులో ఫినాల్, ప్లేవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్సియం, ఇనుము వంటి ఖనిజాలు అధికంగా ఉండటంతో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నిషియం పుష్కలంగా ఉండటంతో కండరాలకు నీరు పట్టకుండా సాయపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇలా చాక్లెట్లు పీరియడ్ సమయంలో మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.