
Active Throught Day : మనం ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే బద్ధకంగా ఉంటుంది. ఏదో మత్తుగా అనిపిస్తుంది. ఒళ్లు విరుచుకుని ఆవలించి మంచం మీద నుంచి లేస్తుంటాం. ఇది ముమ్మాటికి బద్ధకమే. మనం మంచం మీద నుంచి లేస్తూనే పనులకు వెళితే హుషారుగా ఉన్నట్లు. లేదంటే బద్ధకంగా ఉన్నట్లే. దీనికి కారణం మనం తీసుకునే ఆహారాలే. కార్బొహైడ్రేడ్లు అధికంగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల మనకు మత్తు అనేది ఉంటుంది. దీంతో మంచం మీద నుంచి లేవడానికే ఐదు నిమిషాలు పడుతుంది. ఇక లేచాక ఏ పని చేయకుండానే ఓ పావు గంట కూర్చుంటాం. తరువాత మెల్లగా దినచర్యలు ప్రారంభిస్తాం.
బద్ధకం పోవాలంటే..
ఉదయం లేవగానే హుషారుగా ఉండాలంటే మంచి నిద్ర ఉండాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ఇంకా వ్యాయామం చేయాలి. ఈ మూడింటిపై శ్రద్ధ పెడితే మనకు హుషారు దానంతట అదే వస్తుంది. దీనికి పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఆహారం, నిద్ర, వ్యాయామం సరిపోతుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగు చూశాయి.
మంచి నిద్ర
ప్రతి మనిషి సగటున రోజుకు 7-9 గంటలు నిద్ర పోవాలి. సరైన తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే.నిద్ర లేనివాడు హుషారుగా ఉండలేవుడు. రోజంతా హుషారుగా గడవాలంటే మనకు నిద్ర ప్రాధాన్యం ఉంటుంది.అందుకే నిద్ర కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. రాత్రి పూట నిద్ర పోతేనే ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. రోజు ఉత్సాహంగా గడుస్తుంది.
పోషకాహారం
రోజు ఎక్కువ కార్బొహైడ్రేడ్లు ఉండే ఆహారాలు తింటే ఉదయం నిద్ర లేవడం కష్టమే. బద్ధకంగా ఉంటుంది. మత్తుగా అనిపిస్తుంది. దీనికి ప్రొటీన్లు ఉన్న ఆహారాలను తీసుకుంటే మనకు బద్ధకం ఉండదు. అన్నంకు బదులు మొలకెత్తిన విత్తనాలు, వాల్ నట్స్ వంటివి తీసుకుంటే మన శరీరంలో చురుకుదనం కలుగుతుంది. దీంతో ఉదయం మనం బద్ధకంగా కాకుండా హుషారుగా నిద్ర నుంచి మేల్కొంటాం.

వ్యాయామం
మన ఆరోగ్యానికి వ్యాయామం కూడా సాయపడుతుంది. రోజు ఓ గంట వ్యాయామం చేస్తే శరీర భాగాలకు రక్తసరఫరా బాగా జరుగుతుంది. దీంతో మనకు ఉదయం పూట హుషారు అనిపిస్తుంది. లేకపోతే బద్ధకంగా ఉదయం ఎనిమిదింటి వరకు పడుకుంటే ఒళ్లంతా మత్తుగా ఉంటుంది. ఇలా ఈ మూడు సూత్రాలు పాటిస్తే రోజు హుషారుగా గడుస్తుందనడంలో సందేహం లేదు.