Happy Honeymoon: జీవితంలో పెళ్లి అనేది మధురఘట్టం. హనీమూన్ అనేది మధురయాత్ర. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు హనీమూన్ వెళ్లాలని తాపత్రయపడుతుంటారు. సంసార జీవితానికి చక్కని వేదికగా దీన్ని మార్చుకుంటుంటారు. అందుకే హనీమూన్ కోసం తెగ ఆరాటపడుతుంటారు. జీవిత భాగస్వామితో టూర్ చేస్తూ అక్కడ ఉండే ప్రదేశాలను ఆస్వాదిస్తూ ఆనందిస్తుంటారు. సెక్సువల్ గా ఇద్దరు పరస్పరం ఒక్కటి కావడానికి కూడా ఇది దోహదపడుతుంది. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకుంటూ జీవితానికి కొత్త మార్గాన్ని వేసుకుంటారు.

కానీ ఇక్కడే చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. పెళ్లయిన వెంటనే హనీమూన్ కు అత్యుత్సాహంతో వెళతారు. అప్పటికే పలు పనులు, బంధువుల ఇళ్లకు తిరగడంతో అలసిపోయి ఉంటారు. దీంతో హనీమూన్ అంటే హుషారైన మూడ్ రాని పరిస్థితి. అందుకే పెళ్లయిన రెండు మూడు వారాలకు హనీమూన్ ప్లాన్ చేసుకుంటూ పరిపూర్ణంగా ఉంటుంది. ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని హడావిడిగా కానిచ్చేయాలనే ఆతృత ఉంటే పనికి రాదు. ఎందుకంటే జీవితంలో మరోసారి హనీమూన్ కు వెళ్లే అవకాశం రాదు.
Also Read: Diabetes Diet: డయాబెటిక్ పేషెంట్లు ఏ ఆహారం తీసుకోకూడదో తెలుసా?
ఇక హనీమూన్ కు వెళ్లాక కొందరేమో హోటల్ గదిలోనే కాలం గడుపుతుంటారు. దీంతో ఒళ్లు బద్దకంగా మారుతుంది. జీవిత భాగస్వామి కూడా బోరుగా ఫీలవుతుంది. అందుకే కాస్త ఎంజాయ్ మెంట్ ఉండాలంటే అక్కడి దర్శనీయ ప్రదేశాలను చూస్తూ ఉండాలి. మరికొందరేమో అసలు హోటల్ గదికే రాకుండా బయటే గడుపుతుంటారు. ఇది కూడా సమంజసం కాదు. బయట తిరిగినంత సేపు తిరగాలి. మళ్లీ గదికి చేరుకుని జీవిత భాగస్వామితో ముచ్చటిస్తే రొమాంటిక్ గా ఉంటుంది. మన జీవితాన్ని మనమే ఆస్వాదించాలి. మన కోరికలను మనమే తీర్చుకోవాలి.

హనీమూన్ అంటే అదేదో గాబరాగా చేసే పని కాదు. నిదానంగా పూర్తిగా సంయమనంతో ఇరువురి అంగీకార యోగ్యంగా ఉండాలి. అంతేకాని ఏదో తతంగంలా చూస్తూ కానీ అనే ధోరణి మంచిది కాదు. ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకుంటూ ఒకరి ఆశలు మరొకరు తీరుస్తూ సంతోషంగా చేసుకునేదే హనీమూన్. హనీమూన్ గురించి ఎన్నో సినిమాల్లో చూపిస్తుంటారు కదా. అలా మన జీవితభాగస్వామిని సంతోషపెట్టే ఓ బృహత్తర కార్యక్రమమే మధురయాత్ర అని తెలుసుకుంటే మంచిది.
Also Read:Jagan Delhi Tour: జగన్ ఢిల్లీ ఎందుకెళ్లినట్టు? ఎందుకొచ్చినట్టు?