Diabetes Diet: మనదేశం డయాబెటిస్ రాజధానిగా మారుతోంది. షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో చైనా, ఇండియాలే ముందంజలో ఉండటం తెలిసిందే. షుగర్ వ్యాధితో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మధుమేహంతో బాధపడేవారికి అవయవాలు అన్ని పాడైపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో షుగర్ ను అదుపులో ఉంచుకోకుండా అనర్థాలే. మధుమేహంతో చాలా సమస్యలు చుట్టుముడతాయి. షుగర్ తో గుండె, కాలేయం, కిడ్నీలు కూడా దెబ్బతింటాయని చెబుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు కంట్రోల్ లో ఉండకపోతే దిగులు పడాల్సిందే.

ఇక వీరు తీసుకునే ఆహారం కూడా ప్రత్యేకంగా ఉండాల్సిందే.
మధుమేహులు తీసుకోని ఆహారంలో వైట్ బ్రెడ్ కు దూరంగా ఉండటమే మంచిది. వైట్ బ్రెడ్ ధర తక్కువే అయినా అందులో ఉండే కార్బోహైడ్రేడ్లతో చక్కెర పెరిగిపోతోంది. శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. షుగర్ ఉన్న వారు వీటిని పక్కనపెడితేనే ప్రయోజనం కలుగుతుంది. షుగర్ పెరగని ఆహారం తీసుకుంటే మేలు కలుగుంది. దీనికి వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read: Jagan Delhi Tour: జగన్ ఢిల్లీ ఎందుకెళ్లినట్టు? ఎందుకొచ్చినట్టు?
తిండి విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదమే. దీన్ని గుర్తించాలి. లేకపోతే మనకు ఇబ్బందులు రావొచ్చని చెబుతున్నారు.
కొవ్వు తీయని పాలు తీసుకుంటే అనర్థమే. దీంతో పాలల్లో పేరుకుపోయిన మీగడ తీసేయాలి. అప్పుడే పితికిన పాలలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. అందుకే కొవ్వు తీయని పాలు తీసుకుంటే నష్టమే కలుగుతుంది. పాలతో తయారయ్యే పాలకోవ, మైసూర్ పాక్ లాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.
ఇంకా షుగర్ వ్యాధిగ్రస్తులు తెల్ల అన్నం తీసుకోవడం వద్దు. అందులో ఉండే కార్బొహైడ్రేడ్లు ఉండటం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయని తెలుస్తోంది. తెల్ల అన్నంకు బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే శ్రేష్టమే.

మధుమేహులు బంగాళాదుంపలు తీసుకోవద్దు. ఇందులో ఉండే గ్లూకోజ్ తో షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. అందుకే ఆలుగడ్డలు తినకపోతేనే శ్రేయస్కరం. ఇంకా ఫ్రూట్ జ్యూస్ లు కూడా తీసుకోవద్దు. ఫ్రూట్ లు తీసుకుంటే ప్రయోజనమే కానీ ఫ్రూట్ జ్యూస్ లు మాత్రం మంచివి కావు. షుగర్ వ్యాధిగ్రస్తులు పండ్ల రసాలకు దూరంగా ఉండటమే వారికి మంచిదని తెలుస్తోంది. అందుకే చక్కెర ఉన్న వారు ఫ్రూట్ జ్యూస్ లు తాగకుండా ఉంటేనే మేలు కలుగుతుందని తెలుసుకోవాలి.
షుగర్ ఉన్న వారు ఎండు ద్రాక్షను తీసుకోరాదు.
ఇందులో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఎండు ద్రాక్షను తీసుకోకపోవడమే ఉత్తమం. ఇంకా మేక, గొర్రె మాంసాన్ని తీసుకోవద్దు. దీనికి బదులు చికెన్, చేపలు, బీఫ్ తినొచ్చు. వీటితో ఏ అనర్థాలు ఉండవు. కూల్ డ్రింక్స్ కు కూడా దూరంగా ఉండాలి. ఇవి తీసుకుంటే నష్టమే. దీంతో షుగర్ పేషెంట్లు జాగ్రత్తలు పాటించాల్సిందే మరి.
Also Read:Lepakshi Knowledge Hub Scam: ‘లేపాక్షి’ స్కాం జగన్ ను ముంచేస్తుందా?
[…] Also Read: Diabetes Diet: డయాబెటిక్ పేషెంట్లు ఏ ఆహారం తీస… […]