Bigg Boss Season 6 Rating: బిగ్ బాస్ తెలుగు 6 గ్రాండ్ ఫినాలే ఎంత పెద్ద ఫెయిల్యూర్ అనేది టీఆర్పీ రేటింగ్ తో స్పష్టం అయ్యింది. గత ఐదు సీజన్స్ కంటే లోయస్ట్ నమోదైంది. సీజన్ 5 రేటింగ్ లో సగం కూడా రాలేదు. టాప్ రేటింగ్ కి ఆమడ దూరంలో ఉండిపోయింది. ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్ యాక్టర్ సమీర్ ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సీజన్ 6 లో అసలు కంటెంట్ లేదు. అంతా స్క్రిప్టెడ్ లా ఉంది. నాగార్జున హోస్టింగ్ కూడా అంతంత మాత్రమే. ఫస్ట్ సీజన్ తో కంపేర్ చేసుకంటే ఈ విషయం మీకు ఈజీగా అర్థం అవుతుంది అన్నారు.

సమీర్ అన్న మాటలో ఎలాంటి తప్పు లేదు. నిజానికి ప్రేక్షకుల అభిప్రాయం కూడా అదే. సీజన్ 1 సెట్ పూణేలో జనజీవనానికి దూరంగా అడవుల్లో వేశారు. అక్కడ పక్షులు, ప్రకృతి శబ్దాలు మినహాయించి కంటెస్టెంట్స్ కి మిగతా ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేస్తున్నప్పటి నుండి లీకులు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా ఎలిమినేషన్స్ లో మజా పోతుంది. ఈ వారం ఎవరు ఎలిమినేటయ్యేది ఒకటి రెండు రోజులు ముందే తెలిసిపోతుంది. మీడియాలో ఎలిమినేషన్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: Vijay Devarakonda-Rashmika Romance : ఒకే గదిలో రష్మిక-విజయ్ దేవరకొండ… ఇండస్ట్రీని ఊపేస్తున్న వీడియో!
దాదాపు షోలో జరుగుతున్న ప్రతి కీలక విషయం లీక్ అవుతుంది. లీకుల సంగతి అటుంచితే బిగ్ బాస్ సీజన్ 6లో కొత్త కంటెంట్ లేదు. గత సీజన్లో ఉన్న పాత గేమ్స్, టాస్క్ నిర్వహించారు. అలాగే నాగార్జున హోస్టింగ్ సాదాసీదాగా సాగింది. వీకెండ్ ఎపిసోడ్ రేటింగ్ కూడా 4 దాటలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఎలిమినేషన్స్ సైతం విమర్శలపాలయ్యాయి. ఇవన్నీ ఫినాలే మీద ప్రభావం చూపాయి. బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరనే ఆసక్తి జనాల్లో లేదని చెప్పడానికి ఎపిసోడ్ కి వచ్చిన టీఆర్పీనే రుజువు.
సీజన్ 6 గ్రాండ్ ఫినాలే కేవలం 8.19 టీఆర్పీ తెచ్చుకుంది. రవితేజ, ఊర్వశి రాతెలా కూడా ఎపిసోడ్ ని కాపాడలేకపోయారు. గత ఐదు సీజన్స్ తో పోల్చితే ఇదే లోయస్ట్. సీజన్ 5 ఫినాలే టీఆర్పీ 16.04గా నమోదైంది. అంటే లేటెస్ట్ సీజన్ టీఆర్పీ సగానికి పడిపోయింది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్ 1 గ్రాండ్ ఫినాలే టీఆర్పీ 14.13. అప్పటికి షో పట్ల జనాల్లో అంతగా అవగాహన లేదు, ఇప్పుడున్నంత క్రేజ్ లేదు. ఇక నాని హోస్ట్ గా ఉన్న సీజన్ 2 టీఆర్పీ 15.05. తర్వాత నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు తీసుకోగా సీజన్ 3…. 18.29, సీజన్ 4… 19.21 టీఆర్పీ రాబట్టాయి. గణాంకాలు పరిశీలిస్తే సీజన్ 6 ప్లాప్ అని స్పష్టంగా తెలుస్తుంది.
Also Read: Shruti Haasan: చీరలో ఆ పని చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా..!