Women Health: జీవితంలో రుతుక్రమం ఆగిపోయినప్పుడు మెనోపాజ్ లక్షణాలు వస్తాయి. మెనోపాజ్ దశలో ఎన్నో రకాల వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ పరిస్థితుల్లో మన ఆహార వ్యవహారాలు కూడా మార్చుకోవాలి. లేదంటే ఇబ్బందులు తలెత్తుతాయి. మెనోపాజ్ స్టేజీలో మహిళలకు కొన్ని రకాల బాధలు రావడం సహజమే. జీవనశైలిలో కూడా మార్పులు తెచ్చుకోవాలి. మెనోపాజ్ దశలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మనం తీసుకునే ఆహారాలు కూడా ముఖ్యమే. సోయాబీన్స్ జాతి గింజలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే ఫలితం ఉంటుంది.

గుమ్మడి, క్యారట్, బొప్పాయి, టొమాటో వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. యాంటీ క్యాన్సర్ పదార్థాలుగా వీటిని భావిస్తారు. అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్, చేపల్ని తీసుకోవడం మంచిది. ఫైబర్, ప్రొటీన్లు ఉండే పదార్థాలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ కలిపినవి తీసుకోకపోవడమే మంచిది. తరచుగా వ్యాయామం చేస్తుండాలి. దీంతో ఎముకల్లోకి కాల్షియం చేరుతుంది. రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తక్కువ అవుతాయి.
మెనోపాజ్ సమయంలో చికాకులు వస్తాయి.వాటిని అధిగమించేందుకు మెదడు చురుగ్గా ఉండాలి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నలభై సంవత్సరాలు దాటిన తరువాత మమోగ్రామ్, పాప్ స్మియర్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బీపీ వంటివి పరీక్షించుకోవాలి. మెనోపాజ్ దశ వచ్చిన ఐదేళ్లకోసారి బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించుకుంటే మంచిది. మెనోపాజ్ తరువాత మనకు వచ్చే ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తేనే ప్రయోజనం ఉంటుంది. అందుకు తగిన మందులు వాడుకోవాలి.

మహిళలకు ఎదురయ్యే సమస్యలు ఇప్పుడే వస్తాయి. పలు రకాల వ్యాధులు చుట్టుముడతాయి.
దీన్ని అధిగమించడానికి మన జీవనశైలి మార్చుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకుంటే ప్రయోజనం. మెనోపాజ్ సమయంలో వారికి ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించుకుని వాటిని నిర్మూలించేందుకు తగిన మందులు తీసుకోవాలి. లేదంటే అవి ముదిరితే మరింత ప్రమాదకరంగా మారతాయి. అందుకే మెనోపాజ్ దశలో జాగ్రత్తగా ఉండకపోతే ఇంకా సమస్యలు పెరుగుతాయి. మెనోపాజ్ లో మహిళలకు వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఎలాంటి సమస్యలు రాకుండా చేసుకోవడంలో అప్రమత్తంగా ఉండండి.