Fasting: ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గేందుకు నానా రకాల పాట్లు పడుతున్నారు. వారానికి ఒక రోజు ఉపవాసం చేస్తూ మిగిలిన రోజులు ఆహారం తీసుకుంటున్నారు. దీంతో ఉపవాసం సమయంలో ఏం తినకుండా ఉంటే మనకు ఇబ్బందే కలిగే అవకాశముంది. కొందరు పళ్ల రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తారు. మరికొందరు ఏం తినకుండా కూడా చేయడంతో శరీరానికి నష్టమే. ఒక వ్యక్తి రోజుకు 16 గంటలు ఆకలితో ఉంటాడు. మిగిలిని 8 గంటల్లో పరిమిత పరిమాణంలో ఆహారం తీసుకుంటాడు. 5 రోజులు సాధారణ ఆహారం తీసుకున్నా రెండు రోజులు మాత్రం తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి.

వారానికి కనీసం 24 గంటలు ఉపవాసం ఉంటారు. బరువు తగ్గడానికి కూడా ఉపవాసం చేస్తున్నారు. మరుసటి రోజు ఆహారం తీసుకుంటారు. దీంతో బరువు తగ్గడం ఏమో కానీ గ్యాస్ సమస్య వస్తుంది. ఆహారం తీసుకునే రోజు కేవలం 500 కేలరీలు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఉపవాసం పేరుతో కడుపు మాడ్చుకోవడం వ్యాధులు రావడానికి కారణం అవుతుంది. డైట్ ప్లాన్ అమలు చేయాలనుకుంటే ప్రొటీన్లు ఉండే ఆహారం తీసుకుంటే సరిపోతోంది. అంతేకాని ఉపవాసం చేస్తూ కడుపు మాడ్చుకుంటే ఇతర దుష్ర్రభావాలు చోటుచేసుకుంటాయి.
రోజుకు ఒక పూట ఉడకని ఆహారం తీసుకుంటే తేలిగ్గా ఉంటుంది. మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, సలాడ్లు తీసుకుంటే సరిపోతుంది. ఒక రోజు ఉపవాసం ఉండి తెల్లవారి ఇష్టారాజ్యంగా తింటే నిన్నటిది ఇవాళ తీసుకున్నట్లు అవుతుంది. ఉపవాసాలు అందరికి మంచివి కావు. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారు వాటికి దూరంగా ఉంటేనే మంచిది. లేదంటే ఇంకా నష్టాలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఉపవాసం గురించి పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఉపవాసం చేస్తే కడుపు ఖాళీ అయి మంచి రిపేరు కూడా జరుగుతుంది.

ఉపవాసం చేసినట్లయితే కేవలం నిమ్మకాయ నీరు, తేనె కలుపుకుని తాగాలి. గంటకోసారి ఇలా చేయాలి. ఇంకా మధ్యలో మంచినీరు తాగితే సరిపోతుంది. కడుపులోని అన్ని అవయవాలు రిపేరు చేసుకుని మరుసటి రోజుకు బాగా రెడీగా ఉంటాయి. దీంతో ఉపవాసం మంచిదే కానీ కొందరికే. అందరికి సాధ్యం కాదు. ఉపవాసం ఉండి మరుసటి రోజు కూడా సమతుల్య ఆహారం తీసుకుంటేనే ప్రయోజనం కలుగుతుంది. ఉపవాసం చేసుకుని కడుపును మరింత బాగా పనిచేసేందుకు సిద్ధం చేసుకోవచ్చు.