Jubilee Hills Society : జూబ్లీహిల్స్ సొసైటీ అక్రమాల కథ ఆసక్తి రేపుతోంది. జూబ్లీహిల్స్ సొసైటి పుట్టుక, దాని వివాదాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. పోయిన సారి ఈ సొసైటీలో జరిగిన ఎన్నికల్లో కొత్త టీం గెలిచింది. అయితే స్టోరీ అక్కడితోనే అయిపోలేదు. కొత్తగా గెలిచిన వారు పాత టీం అవినీతి, అక్రమాలు బయటపెట్టి కొన్నిచర్యలు తీసుకునే దిశగా కదిలారు. అయితే ఓడిపోయిన వారు ఇప్పుడు దానికి కౌంటర్ గా చర్యలు తీసుకుంటున్నారు.
జూబ్లీహిల్స్ సొసైటికి మరో అనుబంధ సంస్థ ఉంది. ‘జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్’. దీన్నే జూబ్లీహిల్స్ క్లబ్ అంటారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద ఉండే ఈ క్లబ్ 1987లో స్థాపించారు. ఇది 7.50 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీన్ని పబ్లిక్ సొసైటీ కింద రిజిస్ట్రర్ చేసి దీన్ని సపరేట్ బాడీ సభ్యులను ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ సభ్యులే ఇందులో సభ్యులుగా ఉంటారు. అయితే ఇందులో మెంబర్ షిప్ కోసం మరిన్ని డబ్బులను చెల్లించి తీసుకోవాలి.
సొసైటీ మెంబర్స్ కానీవారు సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలంటే ఇందులో 30 లక్షలు చెల్లించాలి. ఇక ఫిలింనగర్ ఆ ప్రాంతాల్లో సభ్యత్వం కావాలంటే 17 లక్షలు పెట్టి సభ్యత్వం తీసుకోవాలి. దీన్ని బట్టి ఇదంతా ఉన్నవాళ్లకు సంబంధించిన వ్యవహారంగా చెప్పొచ్చు. ఇక మద్యం విక్రయాల్లో అత్యధిక విక్రయాలతో జూబ్లీహిల్స్ క్లబ్ నంబర్ 1గా నిలిచింది. జూబ్లీహిల్స్ సొసైటీకి, క్లబ్ కి మధ్య వివాదమేంటి..? అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను ‘పైన’ వీడియోలో చూడొచ్చు.
