Married Women: వామ్మో కొత్తగా పెళ్లైన మహిళలు వాటి గురించి సెర్చ్ చేస్తున్నారా?

ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో ఇంట్లో ఉండే తెలుసుకుంటున్నారు. ఇక చిన్నారుల నుంచి పెద్దల వరకు గూగుల్ ను నమ్ముకుని తమకు కావాల్సిన వాటిని వెతికేస్తున్నారు.

Written By: Swathi, Updated On : March 5, 2024 10:29 am

Married Women

Follow us on

Married Women: ఫోన్ అనేది జస్ట్ ఒక సాధనం కాదు. ఇది మనిషి జీవితంలోనే అత్యంత ముఖ్యమైన పార్ట్ గా తయారైంది. ఈ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి సందేహం ఉన్నా.. వెంటనే గూగుల్ తల్లిని అడిగేస్తున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులను, స్నేహితులను వారికి ఉన్న సందేహాల గురించి అడిగితే.. ఇప్పుడు జై గూగుల్ అంటున్నారు. ఉదయం నిద్ర లేచినదగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ లోనే మునిగితేలుతున్నారు. ఫోన్ ఉంటే ఏ పని అయినా చిటికెలో అయిపోతుంది అంటున్నారు కూడా.

ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో ఇంట్లో ఉండే తెలుసుకుంటున్నారు. ఇక చిన్నారుల నుంచి పెద్దల వరకు గూగుల్ ను నమ్ముకుని తమకు కావాల్సిన వాటిని వెతికేస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే తమకు ఏం కావాలో తెలుసుకుంటున్నారు. తాజాగా నిర్వహించిన గూగుల్ సెర్చింగ్ సర్వేలో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయట. ఇంతకీ సర్వే ఏం చెబుతుంది అంటే.. కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్ లో ఏ వెతుకుతున్నారో తెలిపింది. వారు ఏం వెతికారో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.

చాలా మంది కొత్తగా పెళ్లైన అమ్మాయిలు తన భర్తను ఏ విధంగా ఆకట్టుకోవాలి. భర్త తన మాట వినాలంటే ఏం చేయాలి? అంతే కాదు అత్తగారిని తన వైపు ఎలా తిప్పుకోవాలి అనే వాటి గురించి గూగుల్ తల్లిని అడుగుతున్నారట. ఇదిగో ఈ విషయాలు సర్వేలో తెలియగానే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పిల్లలు పుట్టడానికి భార్య భర్తలు ఏ సమయంలో కలవాలి అని సెర్చ్ చేస్తున్నారట. ఇవన్నమాట కొత్తగా పెళ్లైన వారు గూగుల్ లో సెర్చ్ చేస్తున్న విషయాలు..

ఒకప్పుడు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఇతరుల నుంచి పెద్దల నుంచి తెలుసుకునేవారు. కానీ రానురాను టెక్నాలజీ పెరగడంతో గూగుల్ నే నమ్ముకుంటున్నారు. మరి రాను రాను ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఏంటో అని ఆశ్చర్యపోతున్నారు కొందరు. మరేదైన సర్వే వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం..