Weight Loss Tips: మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. భక్తాయాసం వచ్చే దాకా తినడం బరువు పెంచుకోవడం ఆపై బాధపడటం చేస్తున్నారు. దీంతో శరీరం బరువుగా మారడమే కాకుండా రోగాలకు మూలం అవుతుంది. శరీరంలో పేరుకుపోయే కొవ్వులు మనకు అనర్థాన్నే తెస్తాయి. అయినా ఎవరు లెక్క చేయడం లేదు. అధిక బరువును అలాగే మోస్తున్నారు. మన ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోతే మన మోకాళ్ల చిప్పలు కూడా అరుగుతాయి. దీంతో మన ఆరోగ్య వ్యవస్థ అతలాకుతం అవుతుంది. కానీ ఎవరు కూడా ఈ విషయాలపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అన్ని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఫలితంగా గుండె జబ్బులు వంటివి కూడా త్వరగా సోకుతూ ఆయుష్షును తగ్గిస్తున్నాయి.

బరువును తగ్గించుకోవడానికి వాకింగ్, జాకింగ్ వంటివి చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. పై నుండి వేసేవి వేసుకుంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. దానికి సరైన మందు తీసుకుంటేనే ఉపశమనం లభిస్తుంది. అధిక బరువును కంట్రోల్ చేయడానికి ఓ పానీయం ఔషధంలా పనిచేస్తుంది. ఇది కాదనలేని నిజం. దీనికి గాను మనం చేయాల్సిందల్లా ప్రతి రోజు ఆ జ్యూస్ తాగగడమే. ఇది తయారు చేసుకోవడం సులభమే. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అల్లం, నిమ్మరసం, అలోవేరా జ్యూస్, తేనెను కలుపుకుని తాగితే ఫలితం కచ్చితంగా కనిపిస్తుంది.
ఇందులో ఉండే ఔషధ గుణాలు మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిస్తాయి. అలోవేరా జ్యూస్ మన శరీరానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో 75 విటమిన్లతో పాటు మినరల్స్, అమినో యాసిడ్లు, ఎంజైమ్స్, ప్యాటీ యాసిడ్లు మనకు జీవక్రియలను పెంచుతాయి. ఫలితంగా శరీరంలో వ్యర్థాలు బయటకు పోతాయి. నిమ్మకాయ కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక బరువును తగ్గించడంలో నిమ్మకాయ పాత్ర కూడా ఎంతో కీలకం.

ఇక మన వంటింట్లో ఉండే అల్లంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గించడంలో ప్రతిభావంతంగా పనిచేస్తుంది. జీవక్రియల రేటును పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతలను పెంచి బరువును తగ్గిస్తుంది. తేనె కూడా మన ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ డ్రింకును ఎలా తయారు చేసుకోవాలంటే ఓ గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ అలోవేరా జ్యూస్, మరో టీ స్పూన్ నిమ్మరసం, మరో టీ స్పూన్ అల్లం రసం, ఒక టీ స్పూన్ తేనె కలుపుని రోజు ఉదయం, సాయంత్రం తాగితే ఫలితం వస్తుంది. ఇలా ఓ మూడు నెలల పాటు చేస్తే బరువు తగ్గడం సులభం అవుతుంది. ఇది అందరు పాటిస్తే మంచిది.