
Hemoglobin: మనలో చాలా మంది ఎదుర్కొనే సమస్య రక్తహీనత. ముఖ్యంగా ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలో మగవారిలో 16 గ్రాములు, మహిళల్లో 12 గ్రాములు ఉండాలంటారు. కానీ అలా ఉండకపోతే రక్తహీనత ఉన్నట్లు లెక్క. రక్తహీనతతో మనకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. శక్తి సన్నగిల్లుతుంది. అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. గుండె మన శరీరంలోని ఐదు లీటర్ల రక్తాన్ని నిత్యం పంపు చేస్తుంది. కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే రక్తం కూడా తగినంత ఉండాలి. లేదంటే ఇబ్బందులొస్తాయి. దీనికి గాను మనం రక్తం సమృద్ధిగా లభించేందుకు కొన్ని ఆహారాలు తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది.
బీట్ రూట్ తో..
రక్తాన్ని పెంచడంలో బీట్ రూట్ ప్రధానమైనది. ఇందులో ఉండే పోషకాలతో మనకు రక్తం బాగా వస్తుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి దూరం కావచ్చు. ఆకుకూరల్లో కూడా మంచి పోషకాలు ఉండటంతో వాటిని ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. ఆకుకూరల్లో తోటకూర ముఖ్యమైనది. తోటకూర, పాలకూర, గోంగూర, బచ్చలికూర, చుక్కకూర, తుంటి కూర ఏదైనా మనకు మంచి పుష్టిని కలిగించడంలో సాయపడతాయి. అందుకే ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటే రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది.
దానిమ్మతో..
దానిమ్మలో కూడా రక్తహీనతను పోగొట్టే శక్తి ఉంటుంది. దానిమ్మ గింజలు తిన్నా రసం తాగినా రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇందులో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల మనం తరచుగా దానిమ్మ గింజలు తింటూ ఉండాలి. నిమ్మకాయలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ప్రతి రోజు నిమ్మకాయను గోరువెచ్చని నీళ్లలో పిండుకుని తాగితే మంచి లాభాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మకాయను తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిదే.
పుచ్చకాయలో..
పుచ్చకాయలో రక్తకొరతను తీర్చే గుణం ఉంటుంది. వేసవి కాలంలో పుచ్చకాయలు పుష్కలంగా లభిస్తాయి. దీంతో పుచ్చకాయలను రోజువారీ ఆహారంలో చేర్చుకుని రక్తం సమృద్ధిగా కలిగేందుకు దోహదం చేస్తుంది. క్యారెట్, పాలకూర రసం తాగడం వల్ల కూడా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి కారణమవుతుంది. వీటిని తీసుకోవడం వల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయి. దీని వల్ల పాలకూరను తరచుగా ఆహారంగా తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుందనడంలో సందేహం లేదు.

నేరేడు పండ్లతో..
నేరేడు, ఉసిరి కాయలు మనకు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి. నేరేడులో ఎన్నో పోషకాలు ఉంటాయి. మధుమేహం ఉన్న వారికి దివ్య ఆహారంగా వీటిని పేర్కొంటారు. ఉసిరి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటి రసం తాగడం వల్ల మన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు రెట్టింపవుతాయి. రక్తహీనతతో బాధపడే వారు వీటిని తీసుకోవడం మంచి ఫలితాలు ఇస్తాయి. ఇంకా బచ్చలికూర, పుదీనా రసాలు కూడా రక్తహీనతను దూరం చేస్తాయి. వీటిని తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.