Period Cramps: వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. నొప్పులలో అతి భయంకరమైనది గుండెనొప్పి అని అందరూ అంటారు కానీ.. గుండె నొప్పి కన్నా పీరియడ్స్ నొప్పి ఇంకా భయంకరంగా ఉంటుందంట. మనం ఎప్పుడో ఒకసారి భరించే ఈ గుండెనొప్పి గురించి ఇంతలా భయపడుతున్నాం.. కానీ మహిళలు ఇటువంటి బాధను ప్రతినెలా అనుభవిస్తుంటారు.
సాధారణంగా పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు కడుపునొప్పితో బాధపడుతుంటారు. కొంతమందిలో ఈ నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఎంతలా అంటే కూర్చున్న ప్లేస్ నుంచి లేవలేని పరిస్థితులతో పాటు ఏ పని చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అయితే పీరియడ్స్ సమయంలో గర్భాశయ కండరాలు సంకోచానికి గురికావడం వలన నొప్పి వస్తుంది. అలాగే అండాశయాలలో ప్రోస్టాగ్లాండిన్ అనే హర్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది కూడా నొప్పికి ఒక కారణమని చెప్పుకోవచ్చు.
మహిళల్లో పీరియడ్స్ సమయంలో విపరీతంగా నొప్పి రావడానికి కారణం ఎండోమెట్రియోసిస్.
యూట్రస్ లోపల ఉండే ఎండోమెట్రీస్ అనే పొర ప్రతి నెలా కొత్తగా తయారవుతుందని వైద్యులు చెబుతున్నారు.
అయితే పీరియడ్స్ సమయంలో నొప్పిని తగ్గించేందుకు చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించడం వలన కాస్త ఉపశమనం పొందవచ్చు. ఈ సమయంలో నీళ్లను ఎక్కువగా తాగటం వలన నొప్పి కాస్త తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పీరియడ్స్ రావడానికి ముందు బొప్పాయి పండును తినడం వలన కూడా నొప్పి రాకుండా ఉపయోగపడుతుందట. అలాగే బెల్లం.. అప్పుడప్పుడు బెల్లం తినడం వలన బలం చేకూరడంతో పాటు పీరియడ్స్ నొప్పిని కాస్త తగ్గించుకోవచ్చని తెలుస్తోంది.
అలాగే రెండు కప్పుల నీటిలో తులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని రోజంతా తాగడం వలన కూడా నొప్పి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా మూడు రోజులపాటు తాగిచే మంచి ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా మెంతులను రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఈ విధంగా కూడా నొప్పి తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయిల్ ఫుడ్స్, బేకరీ, ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండటంతో పాటు పండ్లు, కూరగాయాలు ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్స్ చెబుతున్నారు.