Milk Flown Away: హైదరాబాద్ : అనాదిగా మన ఆచార సంప్రదాయాల్లో అనేక కట్టుబాట్లు ఉన్నా యి. వాటిని ఆచరించిన మన పూర్వీకులు తమ అనుభవం లోకి వచ్చిన ఎన్నో అనుభూతులను మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు అనేక రకాల పనులు చేస్తూఉంటాం. ఆ సందర్భంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అటువంటి వాటిలో పలు పొంగి పోవడం..ఇది ప్రతి ఇంట్లో ఎప్పుడోకప్పుడు చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది.

కొంతమంది అప్పుడప్పుడూ పాలను పొయ్యి మీద పెట్టి ఏదో ఆలోచిస్తూ ..వేరే పనిలో పడి స్టవ్ మీద ఉంచిన పాలను మరిచిపోవడం సహజంగానే జరుగుతుంటుంది. ఆలోచన నుంచి తేరుకుని పాలు గుర్తుకు వచ్చే సమయానికి పాలు పొంగిపోతాయి. ఒక్కోసారి పాలు బాగా మరిగి పనికిరాకుండా అవుతాయి. ఇలా సహజంగానే అప్పుడప్పుడూ అందరి ఇళ్లల్లోనూ జరుగుతూనే ఉంటుంది. కానీ కొందరు పాలు పొంగడాన్ని అశుభంగా భావిస్తూ ఉంటారు. మరికొందరు పాలు పొంగడాన్నిశుభమని భావిస్తారు. అసలు పాలు పొంగడం మంచిదా కాదా.. అనేదానిపై చాలామందికి అనేక సందేహాలున్నాయి. దీనిపై పండితులు ఏమంటున్నారు..?
Also Read: Anil Kumar Yadav: జాడలేని ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్.. సైలెంట్ వెనుక కథ అదా?

తూర్పు దిక్కును శుభ సూచకంగా భావించి చాలా మంది తూర్పు దిక్కున పాలను పొంగిస్తూ ఉంటారు. ఈ విధంగా చేస్తే అదృష్టం, సంపద, శాంతి, ఆరోగ్యం కలుగుతుందని భావిస్తారు. తూర్పు దిక్కు నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీతో అదృష్టం కలుగుతుందని తూర్పు దిక్కున పాలను పొంగించే ఆచారాన్నిఅనుసరిస్తూ ఉంటారు. తూర్పు దిక్కున పాలను పొంగిస్తే మేలు జరుగు తుందని ఇది ఒక నమ్మకమని పండితులు అంటున్నారు.

పాలు పొంగడం మంచిది అని కొందరు, మంచిది కాదని కొందరు అంటుంటారు. పాలు పొగడం శుభ పరిణామానికి సంకేతంగా చెప్తూ ఉంటారు. పాలు సంపదకు, సమృద్ధికి సంకేతం. పాలను శుద్దికి ప్రతీక భావిస్తారు. ముఖ్యంగా స్వచ్చమైన ఆవు పాలను యజ్ఞాలలో నేకాకుండా దైవ కార్యక్రమాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పాలు పొంగడం మంచిదే అని.. పాలు పొంగడం వల్ల ధనం ఇంట్లోకి రావడానికి సూచన అని వేద పండితులు వెల్లడిస్తున్నారు. పాలను మనమే కావాలని పొంగించినా లేదా అనుకోకుండా అవి పొంగినా కూడా మంచిదే అని చెబుతున్నారు.
Also Read:Minister KTR: గ్యాంగ్ రేప్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
[…] Also Read: Milk Flown Away: లాభమా..? నష్టమా..?: వంటింట్లో పాలు … […]