మనం గుడికి వెళ్లి కొబ్బరికాయలు కొడుతూంటాం. అందులో కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయలో పువ్వు వస్తుంది. కొన్ని సందర్భాల్లో కుళ్ళిపోతూ ఉంటుంది. దీంతో కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు పువ్వు వస్తే మంచిదని, కుళ్ళిపోతే ఏవైనా అపశకునం జరుగుతుందా అని భయపడుతుంటారు.
కానీ అటువంటివేమీ జరగవని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి మనం కొబ్బరికాయ కొట్టేముందు కొబ్బరికాయ లోపల ఎలా ఉంటుందో తెలియదు. కానీ కొట్టినప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏదో చెడు జరుగుతుందని ఊహించుకుంటారు. కొబ్బరికాయ కుళ్ళిపోవడం అంటే కొబ్బరికాయ బాగా పండుగా మారిందని అర్థం.
దానివల్ల కొబ్బరికాయ కొట్టిన వాళ్లకు ఎటువంటి దోషం జరగదు. కాబట్టి మీరు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే వెళ్లి చేతులను శుభ్రం చేసుకొని మరో కొత్త కొబ్బరికాయ తీసుకువచ్చి కొడితే సరిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతే కానీ దీని వల్ల భయపడాల్సిన పని లేదని అంటున్నారు. ఇవన్నీ మానవులు సొంతంగా ఊహించుకున్న అపోహలు మాత్రమే.
ఇందులో ఎంత నిజమనేది ఉండదు. చాలా వరకూ మనుషులంతా నెగటివ్ ఆలోచనతోనే ఉంటారు. పాజిటివ్ తో దేనిని తీసుకోరు. దాంతో నెగటివ్ వల్ల లేనివి ఊహించుకొని భయపడుతుంటారని.. అందులో కొబ్బరికాయ కుళ్ళిపోయే విషయం ఒకటని శాస్త్రాలు అంటున్నాయి.
కాబట్టి నెగటివ్ ఆలోచనలు వదిలేసి పాజిటివ్ ఆలోచనలతో ఉంటే అంత మంచే జరుగుతుందని దానివల్ల ముందుకు సాగుతామని తెలుపుతున్నాయి. ఇవన్నీ కేవలం నమ్ముతున్న అబద్ధాలు అంటూ.. వీటి వల్లే ప్రజలు మూఢనమ్మకాలకు బాగా అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలుస్తుంది.