Google Search: కాలంలో సాంకేతిక టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండటంతో చాలా వరకు కావలసిన సమాచారాన్ని గూగుల్ ద్వారా తెలుసుకుంటున్నారు.ఇకపోతే తాజాగా గూగుల్ తెలిపిన నివేదికల ప్రకారం ఎక్కువగా అమ్మాయిలు దేని కోసం గూగుల్ సెర్చ్ చేశారో వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం సుమారు 150 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. అందులో 60 మిలియన్ల మంది మహిళలు ఉండడం విశేషం. ఇక వీరిలో 75 శాతం మంది 15 నుంచి 34 సంవత్సరాల వయస్సు గల వారు ఉండటం విశేషం. మరి ఈ నివేదిక ప్రకారం అమ్మాయిలు గూగుల్‌లో దేనికోసం ఎక్కువగా సెర్చ్ చేశారు అనే విషయానికి వస్తే…

ఎక్కువ మంది అమ్మాయిలు తమ కెరియర్ కి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడానికి గూగుల్ సర్చ్ చేసినట్లు ఈ నివేదిక వెల్లడించింది. చాలామంది వారి భవిష్యత్తులో ఎలాంటి కోర్సులు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాల కోసం ఈ నివేదిక తెలిపింది. అదే విధంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయిలు ఎక్కువగా దుస్తుల కోసం, కొత్త కలెక్షన్స్, ఆఫర్స్ గురించి వెతుకుతున్నారు.
Also Read: చైతూ-ధనుష్ విడాకులు..దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన తప్పేంటి?
ఆ తర్వాత చాలా మంది అమ్మాయిలు అందానికి ప్రాముఖ్యత ఇస్తారు కనుక అందం కోసం ఉపయోగపడే చిట్కాల కోసం ఎక్కువగా గూగుల్ లో వెతికినట్టు తెలుస్తోంది.అదే విధంగా మరి కొంత మంది అమ్మాయిలు ఎక్కువగా మెహందీ డిజైన్స్ కోసం గూగుల్ సెర్చ్ చేసినట్లు ఈ నివేదిక పేర్కొంది. అలాగే రొమాంటిక్ మ్యూజిక్ కోసం పెద్ద ఎత్తున గూగుల్ సెర్చ్ చేసినట్లు ఈ నివేదికలు వెల్లడించాయి.
Also Read: పక్కరాష్ట్రంలో పీవీపీ రౌడీయిజం.. ఏం ధైర్యం రాజా నీది?
[…] Budget: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలో ఫైనాస్స్ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశ పెడుతుంది. ఇందులో జరిపే కేటాయింపులే ఏడాది మొత్తం అమలు చేస్తారు. ఏయే రంగానికి ఎంత మేర ఖర్చు చేయనున్నారనే విషయాన్ని పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రతులను చదివి వినిపిస్తారు. వ్యవసాయం, ఆరోగ్యం, రక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగం ఇలా అన్నింటకీ బడ్జెట్లో కేటాయింపులు చేస్తారు. గత రెండేళ్లుగా దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య రంగాన్ని మెరుగు పరిచేందుకు కేంద్రం బడ్జెట్లో ఎంత మేర నిధులను కేటాయించనున్నదనే విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. […]
[…] Dhanush Ishwarya divorced : చిత్ర పరిశ్రమలో వివాహ బంధాలతో ఇలా ఒక్కటవుతుంటే.. అలా విడిపోతున్నారు. ఎంత వేగంగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారో.. అంతే వేగంగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. గత కొంతకాలం నుంచి సెలబ్రిటీల సినిమాలు కాకుండా వారి వ్యక్తిగత విషయాలతోనే హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. కొందరు నేరాలు, మోసాలతో వార్తల్లోకి ఎక్కితే.. వారి భాగస్వామితో తెగదెంపులు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు మరికొందరు. ఇటీవల టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ నాగ చైతన్య, సమంత విడిపోయారనే విషయాన్ని మరిచిపోక ముందే కోలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ ధనుష్, ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానగణం, ప్రేక్షకలోకం నివ్వెరపోయింది. కారణాలు ఏంటా అని ఆలోచిస్తున్నాయి. […]
[…] Employees: ఏపీ సర్కార్ వర్సెస్ ఉద్యోగ సంఘాల వార్ లో సీఎం జగన్ దే పైచేయిగా నిలిచింది. అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలు, పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై తిరుగుబావుట ఎగురవేసిన ఉద్యోగ సంఘాలు అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఇటీవల ఉద్యోగులు చేసిన సమ్మె వారికి ఎలాంటి లాభం చేకూర్చకపోగా అభాసుపాలైంది. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఏకంగా ఉద్యోగి జీతంలో నాలుగు నుంచి 5వేల కోతకు సిద్ధం కావడంతో వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. […]