https://oktelugu.com/

Google Search: గూగుల్ లో అమ్మాయిలు ఎక్కువగా దేని కోసం సెర్చ్ చేస్తున్నారో తెలుసా?

Google Search: కాలంలో సాంకేతిక టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండటంతో చాలా వరకు కావలసిన సమాచారాన్ని గూగుల్ ద్వారా తెలుసుకుంటున్నారు.ఇకపోతే తాజాగా గూగుల్ తెలిపిన నివేదికల ప్రకారం ఎక్కువగా అమ్మాయిలు దేని కోసం గూగుల్ సెర్చ్ చేశారో వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం సుమారు 150 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. అందులో 60 […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 19, 2022 / 10:39 AM IST
    Follow us on

    Google Search: కాలంలో సాంకేతిక టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండటంతో చాలా వరకు కావలసిన సమాచారాన్ని గూగుల్ ద్వారా తెలుసుకుంటున్నారు.ఇకపోతే తాజాగా గూగుల్ తెలిపిన నివేదికల ప్రకారం ఎక్కువగా అమ్మాయిలు దేని కోసం గూగుల్ సెర్చ్ చేశారో వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం సుమారు 150 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. అందులో 60 మిలియన్ల మంది మహిళలు ఉండడం విశేషం. ఇక వీరిలో 75 శాతం మంది 15 నుంచి 34 సంవత్సరాల వయస్సు గల వారు ఉండటం విశేషం. మరి ఈ నివేదిక ప్రకారం అమ్మాయిలు గూగుల్లో దేనికోసం ఎక్కువగా సెర్చ్ చేశారు అనే విషయానికి వస్తే…

    Google Search

    ఎక్కువ మంది అమ్మాయిలు తమ కెరియర్ కి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడానికి గూగుల్ సర్చ్ చేసినట్లు ఈ నివేదిక వెల్లడించింది. చాలామంది వారి భవిష్యత్తులో ఎలాంటి కోర్సులు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాల కోసం ఈ నివేదిక తెలిపింది. అదే విధంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయిలు ఎక్కువగా దుస్తుల కోసం, కొత్త కలెక్షన్స్, ఆఫర్స్ గురించి వెతుకుతున్నారు.

    Also Read:  చైతూ-ధనుష్ విడాకులు..దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన తప్పేంటి?

    ఆ తర్వాత చాలా మంది అమ్మాయిలు అందానికి ప్రాముఖ్యత ఇస్తారు కనుక అందం కోసం ఉపయోగపడే చిట్కాల కోసం ఎక్కువగా గూగుల్ లో వెతికినట్టు తెలుస్తోంది.అదే విధంగా మరి కొంత మంది అమ్మాయిలు ఎక్కువగా మెహందీ డిజైన్స్ కోసం గూగుల్ సెర్చ్ చేసినట్లు ఈ నివేదిక పేర్కొంది. అలాగే రొమాంటిక్ మ్యూజిక్ కోసం పెద్ద ఎత్తున గూగుల్ సెర్చ్ చేసినట్లు ఈ నివేదికలు వెల్లడించాయి.

    Also Read: పక్కరాష్ట్రంలో పీవీపీ రౌడీయిజం.. ఏం ధైర్యం రాజా నీది?