Paralysis Symptoms: మనలో చాలా మందికి పక్షవాతం వస్తోంది. సరైన ఆహార అలవాట్లు లేకపోవడంతో రోగాల బారిన పడుతున్నాం. అందరు ఎక్కువగా ఫిజాలు, బర్గర్లు తింటున్నారు. ఫలితంగా ఉప్పు, చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో మన రక్తప్రసరణ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మెదడు దెబ్బతింటుంది. దీని వల్ల నరాల్లో బలహీనత వస్తుంది. పక్షవాతం రావడానికి ప్రధాన కారణం రక్తం సరఫరా సక్రమంగా లేకపోవడమే.
పక్షవాతం వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. హఠాత్తుగా చెయ్యి మొద్దుబారిపోవడం, కాలు కదపకపోవడం, మూతి వంకర్లు తిరగడం, మాట పడిపోవడం, నత్తిగా మాట్లాడటం, చూపులో అస్పస్టత, ఒంట్లో మగతగా ఉండటం, విపరీతమైన తలనొప్పి ఇవన్నీ మనకు కనబడతాయి. ఈ సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలా పక్షవాతం వచ్చినప్పుడు మనకు కనిపించేవి.
పక్షవాతం సమస్య తీవ్రంగా ఉంటుంది. జీవితంలో పక్షవాతం వస్తే నరకమే. 90 శాతం మంది పక్షవాతం వచ్చాక కోలుకోవడం కష్టమే. నరాల్లో సెల్స్ చనిపోవడం వల్ల రక్త ప్రసరణలో వివిధ మార్పులు చోటుచేసుకుంటాయి. పక్షవాతంతో కండరాలకు మెదడు నుంచి అందే సర్క్యులేట్ అయ్యే నరాల్లో సెల్స్ చనిపోతాయి. కాళ్లు చేతులు పడిపోతాయి.
కండరాలు బిగుతుగా మారడంతో అవయవాల పనితీరు బాగుండదు. దీన్నే పక్షవాతం అంటారు. ఇలాంటి సమస్య ఎవరికి వచ్చినా అతడి శరీరం మొత్తం దెబ్బతింటుంది. ఇక కోలుకోవడం కష్టమే. ఈ నేపథ్యంలో పక్షవాతం జబ్బు వస్తే ఇక అంతే సంగతి. అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నరాల పనితీరును మెరుగుపరుచుకోకపోతే పక్షవాతం రావడం గ్యారంటీ.