Nagula Chavithi 2022: నాగుల చవితి పండుగకు మహిళలు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ రోజు పుట్టలో పాలుపోసి నాగేంద్రున్ని కొలిచి తమ కోరికలు తీర్చాలని కోరుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు నాగదేవతను పూజించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సంవత్సరం నాగులచవితి అక్టోబర్ 28న శుక్రవారం వచ్చింది. దీంతో మహిళలు తెల్లవారు జాము నుంచే పుట్టలో పాలు పోస్తున్నారు. ఈ రోజు తెల్లవారు జామున నాలుగు గంటల 18 నిమిషాలకు చవితి తిథి ప్రారంభమవుతుంది. ఇది తెల్లవారు జాము 5 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. మహిళలు పుట్టల్లో పాలు పోసి తమ కష్టాలు తీర్చాలని నాగ దేవతను పూజిస్తున్నారు.

నాగుల చవితి రోజు నాగ దేవతకు పూజ చేయడం వల్ల సర్ప దోషాలు పోతాయని చెబుతున్నారు. కుజ దోషం ఉన్నవారు నాగుల చవితి రోజున, కాల సర్పదోషానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వరుడిని కొలిస్తే ఫలితం వస్తుందని విశ్వాసం. నాగుల చవితి రోజు మహిళలు పుట్టలో పాలుపోసి ఉపవాసం చేస్తారు. తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. నాగుల చవితి రోజు నాగదేవతను పూజిస్తే సర్వ రోగాలు దూరమవుతాయని చెబుతారు. సంతాన లేమి సమస్యతో బాధపడేవారు నాగదేవతను పూజిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.
నాగేంద్రుడిని పూజిస్తే శివుడు, విష్ణువుకు పూజ చేసిన ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నాగదోషం ఉన్నవారు నాగదేవతకు పూజలు చేస్తే ఎంతో మేలు కలుగుతుంది. నాగదేవతను పూజించి చలిమిడి, వడపప్పు, చిమ్మిలి నైవేద్యంగా పెట్టడం వల్ల నాగదేవత కటాక్షం ఉంటుదని విశ్వాసం. దాంపత్య దోషాలు తొలగడానికి కూడా నాగదేవతను ఆరాధిస్తే ఫలితం వస్తుంది. పండుగ నాడు నాగదేవతను పూజిస్తే గర్భదోషాలు తొలగిపోతాయి. మనసులో ఏదైనా కోరికలు ఉంటే అవి కచ్చితంగా నెరవేరుతాయని విశ్వసిస్తూ పూజలు చేస్తుంటారు. మహిళలు ఎదగడానికి నాగదేవత సాయం ఉండాల్సిందే. అందుకే అందరు విధిగా పుట్టకు పాలు పోసి ఆరాధించడం సహజమే.

నాగుల చవితికి మహిళలు విధిగా పాలు పోస్తుంటారు. తమ కుటుంబ కష్టాలు తొలగించాలని కోరుకుంటారు. పండుగ పూట అన్ని ఊళ్లలో పుట్టల దగ్గర మహిళలు క్యూ కట్టి మొక్కులు తీర్చుకుంటారు. నాగుల చవితి సందర్భంగా మహిళలు నాగదేవత తమ కోరికలు తీర్చాలని ప్రాధేయపడుతుంటారు. భక్తిశ్రద్ధలతో పూజించి మనసులో కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరాలని ఆశిస్తుంటారు. దీంతో మహిళల ఆరాధ్య దైవం నాగదేవతను ప్రసన్నం చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు.