
Couples Problems : కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుంది అంటారు. కొత్త కాపురంలో అనేక చిక్కులు ఉంటాయి. సాగరం ఈదొచ్చు కానీ సంసారం ఈదలేమని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో సంసారంలో ఉండే బాధలు అలాంటివి. దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడాలంటే ఏకాభిప్రాయం ఉండాలి. అన్నింటికి సర్దుకుపోవాలి. బాధలు పంచుకోవాలి. సుఖాలు కాపాడుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. కొత్తగా పెళ్లయిన వారికి ఏర్పడే ఇబ్బందులేమిటో చూద్దాం.
డబ్బు
కొత్తగా ఒక్కటైన జంటకు డబ్బు ప్రధాన సమస్యగా మారుతుంది. అప్పటి వరకు ఒక్కరే కానీ పెళ్లి తరువాత ఇద్దరు కావడంతో ఖర్చులు పెరుగుతాయి. కొత్త సంసారం కావడంతో అన్ని కొనుక్కోవాలి. అన్ని అవసరాలు తీర్చుకోవాలి. ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని అధిగమించాలంటే డబ్బు ఒక్కటే మార్గం. డబ్బు తగిన విధంగా లేకపోతే తిప్పలు తప్పవు.
ఇతర అవసరాలు
కొత్త సంసారం కావడంతో ఇతర అవసరాలు కూడా ఉంటాయి. దీంతో కొత్త వస్తువులు కొనుక్కోవడంలో కష్టాలు వస్తాయి. ఈనేపథ్యంలో అవసరాలు తీర్చుకునే క్రమంలో కొన్ని ఇబ్బందులు రావడం సహజమే. ఇద్దరి మధ్య మంచి అనుబంధాలు పెరగాలంటే అన్నింటిని షేర్ చేసుకోవాలి. కష్టసుఖాల్లో ఇద్దరి మధ్య అవగాహన ఉంటే మంచిది.
కొత్త కుటుంబం
కొత్తగా పెళ్లి చేసుకుంటే మన కుటుంబంతో పాటు అమ్మాయి తరఫు కుటుంబంలో కూడా మనం ఒకరుగా మారుతాం. వారితో కూడా కలిసి ఉండాల్సి వస్తుంది. పండగలప్పుడు, శుభ కార్యాలు జరిగే సమయంలో మనం అత్తవారితో కలిసి పోవడం చూస్తుంటాం. మన జీవితంలోకి ఇంకో కుటుంబం కూడా రావడంతో మనకు కాస్త సమస్యలు రావడం సహజమే.
కమ్యూనికేషన్ గ్యాప్
ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ దూరం ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉండదు. కష్టాలు ఉంటాయి. ఏ పనిచేయాలన్నా ఇద్దరు మంచిగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఇద్దరి మధ్య దూరం పెరగకుండా జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే ఇద్దరి మధ్య సఖ్యత పెరిగి అనురాగం ఇనుమడిస్తుంది. సంబంధాలు మెరుగుపడతాయి.