
Director Siva Nageswara Rao- Samantha: వరుసగా విలక్షణమైన పాత్రలు పోషిస్తూ కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న సమంత కి రీసెంట్ గా విడుదలైన ‘శాకుంతలం’ అనే చిత్రం మింగుడుపడని రేంజ్ లో భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచినా సంగతి తెలిసిందే.కనీసం మూడు రోజులు కూడా ఈ చిత్రం షేర్స్ ని రాబట్టలేకపోయింది.ఈ చిత్రం ఫ్లాప్ ని జీర్ణించుకోలేకపోతున్న సమంత, ఇక నుండి స్క్రిప్ట్ ఎంపిక విషయం లో ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యిందట.
ప్రస్తుతం ఆమె హాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ రీమేక్ లో హీరోయిన్ గా నటిస్తుంది, ఇందులో వరుణ్ ధావన్ హీరో గా నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ లో క్షణకాలం తీరిక లేకుండా గడుపుతుంది సమంత.ఇదంతా పక్కన పెడితే సీనియర్ డైరెక్టర్ శివ నాగేశ్వర రావు రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సమంత గురించి చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘అందరూ సమంత మొదటి సినిమా ‘ఏం మాయ చేసావే’ అని అనుకుంటూ ఉన్నారు, కానీ ఆమె మొదటి సినిమా మాతో చెయ్యాల్సి ఉంది.2009 వ సంవత్సరం లో మేము ‘నిన్ను కలిశాక’ అనే చిత్రం తియ్యడానికి సన్నాహాలు చేస్తున్నాము.కొన్ని యాడ్స్ లో సమంత ని చూసిన శివ నాగేశ్వర రావు ఈమె అయితే మా సినిమాకి సరిగ్గా సరిపోతుంది అని నమ్మి ఆమెని చెన్నై నుండి పిలిపించుకొని ఆడిషన్స్ చేశారట.ఆమె ఆడిషన్స్ చాలా బాగా చేసింది కానీ, రెమ్యూనరేషన్ భారీ గా డిమాండ్ చెయ్యడం తో మా బడ్జెట్ కి సరిపోక ఆమెని పక్కన పెట్టేసాము.అయితే ఆరోజు ఆమెని తిరిగి చెన్నై పంపడానికి మాకు చాలా ఖర్చు అయ్యింది.ఆరోజు ఫ్లైట్ చార్జీలు ఆకాశాన్ని అంటాయి,ఈ ఒక్కరోజు ఉంది రేపు ఉదయం వెళ్ళమని ఆమెని రిక్వెస్ట్ చేస్తే,ఆ ఒక్క రాత్రి అక్కడ ఉండేందుకు ఆమె పది లక్షలు డిమాండ్ చేసింది.దాంతో వెంటనే ఆమెని ఫ్లైట్ ఎక్కించి పంపేసాము’ అంటూ చెప్పుకొచ్చాడు శివ నాగేశ్వర రావు.