Vastu Tips: మనం ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు పద్ధతులు పాటిస్తుంటాం. ఇంట్లో ఏది ఎక్కడ ఉంచుకోవాలో స్పష్టంగా తెలుసుకుని మరీ జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంట్లో వాస్తు నియమాలకు విరుద్ధంగా ఏ పని చేయం. వాస్తు మన జీవితంపై ప్రభావం చూపుతుంది. కానీ కొన్ని చిన్న చిన్న పనులు మాత్రం వాస్తుకు విరుద్ధంగా చేస్తుంటారు. అలా ఎందుకు చేస్తున్నారంటే ఆ ఏముందిలే అని నిట్టూరుస్తుంటారు. కానీ అవే మన పాలిట అశుభంగా మారతాయని చెబుతున్నా పట్టించుకోరు. ఇంట్లో కూర్చుని గోళ్లు కొరుక్కోవడం, జుట్టు దువ్వుకోవడం వంటి పనులు చేస్తూ మన నష్టాలను మనమే కొనితెచ్చుకుంటున్నాం.

మహిళలు ఇంట్లో ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకుని తిరగరాదు. ఇంట్లో కూర్చుని జుట్టు దువ్వుకోవడం కూడా అరిష్టమే. దీంతో వాస్తు పద్ధతులు కచ్చితంగా పాటించే మనం ఇలాంటి విషయాల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. మహిళలు ఇంట్లో జుట్టు విప్పుకుని తిరిగితే అశుభమని పెద్దవారు కూడా చెబుతుంటారు. వెంట్రుకలు నట్టింట్లో పడితే శనిదేవుడిని ఆహ్వానించినట్లేనని నమ్ముతుంటారు. ఇంట్లో ప్రతికూల వాతావరణం సృష్టిస్తాయని విశ్వసిస్తారు. జుట్టు విరబోసుకుని మహిళలు ఎదురు వచ్చినా పనులు కావని సూచిస్తుంటారు.
మంగళవారం మహిళలు జుట్టు కత్తిరించుకోకూడదు. జుట్టు విరబోసుకుని తిరగడం అరిష్టంగా భావిస్తారు. మంగళవారం జుట్టు రాలితే దారిద్ర్యంగా చెబుతారు. జుట్టు దువ్వుకునే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున కూడా ఇంట్లో కూర్చుని జుట్టు దువ్వుకోవడం మంచిది కాదు. ఎప్పుడు పడితే అప్పుడు తల దువ్వుకోకూడదు. ఊడిపోయిన వెంట్రుకలను కూడా ఇంట్లో ఉంచకూడదు. మనం తినే ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తే తినాలనిపించదు. ఆహారం కలుషితం అవుతుంది. జుట్టు విరబోసుకుని పూజలు చేయకూడదు.

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అందుకే ఆడవారు ఇల్లును చక్కబెట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. అలాగే ఇంట్లో మసలుకునే క్రమంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. జుట్టు విషయంలో కూడా కొన్ని పద్ధతులు పాటించి చెడు ఫలితాలు రాకుండా చూసుకోవాలి. జుట్టును ఎట్టి పరిస్థితుల్లో కూడా విరబోసుకుని తిరగడానికి మొగ్గు చూపకూడదు. జుట్టును ముడుచుకుని ఉంటేనే అందం. ప్రస్తుత పరిస్థితుల్లో జుట్టు విరబోసుకోవడం ఓ ఫ్యాషన్ గా చూస్తున్నారు కానీ ఇంటికి అరిష్టమని తెలుసుకోవడం లేదు. దీంతో మహిళలు జుట్టును ముడుచుకుని వాస్తు రీత్యా నష్టాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.