Eggs Washing: పోషకాహారాలలో కోడిగుడ్డు ఒకటి. మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రొటీన్లు ఉన్న ఆహారాల్లో కోడిగుడ్డు ప్రముఖమైనది. రోజుకో గుడ్డు తింటే ఎలాంటి అనారోగ్యమైనా దూరం అవుతుందని చెబుతారు. అందుకే గుడ్డును మన ఆహారంలో చేర్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందులో ఉండే ప్రొటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటంతో గుడ్లను కడిగి తినడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బందే. గుడ్లు కడిగిన తరువాత తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కడగకుండానే వాటిని తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

సాధారణంగా మనకు మార్కెట్ నుంచి తెచ్చిన ఏ వస్తువునైనా కడగడం అలవాటు. అందులో భాగంగానే గుడ్లను కూడా అలాగే కడిగి వండితే లాభం ఉండదు. కోడిగుడ్లను కడగడం వల్ల బ్యాక్టీరియా పోతుందని అనుకుంటారు. కానీ నిజానికి కడిగితేనే అందులో ఉండే విటమిన్లు పోతాయని చెబుతారు. కడగడం వల్ల నష్టాలు ఎక్కువే ఉంటాయి. గుడ్డుపై ఉండే క్రిములు తొలగిపోవడానికి దాన్ని కడగడం వల్ల అవి చెడిపోయే ప్రమాదం ఉంది. కడిగిన గుడ్లు సాధారణ ఉష్ణోగ్రతలో త్వరగా చెడిపోతాయి. గుడ్లు కడిగిన తరువాత ఎక్కువ సేపు ఉంచకుండా ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
గుడ్లపైన ఉండేవాటిని క్యూటికల్స్, బ్లూమ్ అని పిలుస్తారు. ఇవి గుడ్లను బ్యాక్టీరియా మరియు గాలి నుంచి సురక్షితంగా కాపాడుతాయి. గుడ్లు కడగడం వల్ల వాటి రక్షణ పూత పోతుంది. గుడ్లు త్వరగా చెడిపోతాయి. గుడ్ల ప్రాసెసింగ్ సమయంలో చల్లని నీటితో కడగటం వల్ల పైన ఉండే బ్యాక్టీరియా గుడ్డులోకి ప్రవేశిస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. మనం దుకాణాల్లో కొనుక్కునే గుడ్లను ముందే వారు కడిగి ఉంచుతారు. మనం తరువాత కడగాల్సిన అవసరం లేదు. నేరుగా పౌల్ర్టీఫామ్ నుంచి తెచ్చుకున్న వాటిని వేడి నీటిలో కడుక్కోవచ్చు.

గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ దాన్ని కడిగే విషయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్డును ఉపయోగించే సమయంలో నిపుణులు సూచించిన విధంగా వాడుకోవాలి. అంతేకాని మన ఇష్టం వచ్చినట్లు ఉపయోగించకూడదు. ఈ నేపథ్యంలో గుడ్డుతో ఉండే ఉపయోగాలను దృష్టిలో పెట్టుకుని దాన్ని మన ఆహారంలో వాడుకోవాలి. రోజుకు రెండు గుడ్లు తింటే పోషకాలు ఇంకా మెండుగా అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.