Rahul Gandhi Jodo Yatra: ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టి తెలంగాణ, అవిభాజ్య ఏపీగా మార్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. దేశంలోనూ ఘోరంగా ఓడిపోయింది. అయితే ఏపీకి ఇస్తామన్న ‘ప్రత్యేక హోదా’ను మాత్రం కాంగ్రెస్ మరవలేదు. బీజేపీ పెడచెవిన పెట్టినా కూడా ఇప్పటికీ కాంగ్రెస్ కొనసాగిస్తోంది.

ఏపీ ప్రజలు మరిచిపోయినా.. కేంద్రంలోని బీజేపీ ఇవ్వనని అన్నా రాహుల్ గాంధీ మాత్రం అన్న మాట మీదే నిలబడ్డాడు. తాజాగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే ఏపీకి ఇచ్చిన హామీని రాహుల్ గాంధీ పాదయాత్రలో చూపిస్తూ కొనసాగించడం సంచలనమైంది. “ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్ హక్కు” అనే నినాదం గల బ్యాడ్జీ ధరించి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ నడిచారు.ఏపీలో సాగే పాదయాత్ర మొత్తం ఈ బ్యాడ్జీతోనే రాహుల్ కనిపించబోతున్నారు. తద్వారా ఏపీ ప్రజలకు గెలిస్తే హోదా ఇస్తానన్న హామీని నెరవేరుస్తానని హామీ ఇస్తున్నారు.
ఏపీలోని ఆదోనీ సభలో ప్రజల చేత ప్రత్యేకహోదా సాధించే వరకూ నిరంతర పోరాటానికి కట్టుబడి వుంటామని రాహుల్ గాంధీ ప్రమాణం చేయించనున్నారు.తద్వారా ఏపీపై తమ స్టాండ్ విషయంలో ఎప్పటికీ వెనక్కివెళ్లబోమని సందేహం పంపబోతున్నారు.
పది రోజుల క్రితం యాత్ర కూడా మొదలైంది. తిమిళనాడులో ముగించుకుని ప్రస్తుతం కేరళ దాటి కర్ణాటక దాటి ఏపీలో సాగుతోంది. కర్నాటకలో 21 రోజులు, రాజస్థాన్‌లో 21 రోజులు, కేరళలో 18 రోజులు, మధ్యప్రదేశ్‌లో 16 రోజులు, మహారాష్ట్రలో 16 రోజులు, తెలంగాణలో 13 రోజులు యాత్ర షెడ్యూల్ ఉంది. ఆరు రాష్ట్రాల్లో కలిపితే 105 రోజులు యాత్ర సాగుతోంది. మొత్తం యాత్ర 150 రోజులు ఉండగా, అందులో 105 రోజులు ఆరు రాష్ట్రాల్లో ఉండడం, అందులోనూ కాంగ్రెస్ బలమున్న రాష్ట్రాలు కావడం చూస్తే కాంగ్రెస్ కేవలం పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.